Bro | రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా అడపాదడపా సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన రీసెంట్‌గా బ్రో అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించారు. ఇందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. తమిళంలో వచ్చిన వినోధాయ సిత్తం మూవీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కగా, మూవీని తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనే తెరకెక్కించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. భారీ అంచనాల […]

Bro |
రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా అడపాదడపా సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన రీసెంట్‌గా బ్రో అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించారు. ఇందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ముఖ్య పాత్ర పోషించారు.
తమిళంలో వచ్చిన వినోధాయ సిత్తం మూవీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కగా, మూవీని తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనే తెరకెక్కించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ కాలేదు కాని మోస్తరు విజయాన్ని మాత్రం అందుకుంది.
థియేటర్స్ లో ఈ చిత్రం నిరాశ పరచడంతో ఓటిటిలోకి త్వరగానే వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది. థియేటర్స్‌లో కన్నా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీలో ఈ మూవీని చూసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఆసక్తిపరచే విషయం ఏంటంటే బ్రో చిత్రం పాకిస్తాన్ లో సైతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండ డం . అక్కడ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ 8 వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.మరోవైపు బంగ్లాదేశ్ లో సైతం బ్రో చిత్రం ట్రెండింగ్ లో 8వ స్థానం దక్కించుకుంది.
తెలుగులో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వేరే దేశాలలో దుమ్ము రేపుతుండడం ఫ్యాన్స్‌ని ఎంతగానో సంతోషపరుస్తుంది. చిత్ర కథ విషయానికి వస్తే ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ మరణించడం.. కాల దేవుడు ప్రత్యక్షమై 90 రోజుల్లో జీవిత సత్యాన్ని ఎలా వివరించాడు అనేది మూవీలో ఆసక్తికరంగా చూపించారు.
బ్రో సినిమాలో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తోపాటు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రోహిణి ముఖ్యమైన పాత్రలు పోషించి తమ పాత్రలకి న్యాయం చేశారు. కేతిక, ప్రియా తమ గ్లామర్‌తో మత్తెక్కించే ప్రయత్రం చేశారు.
ఇక ఈ చిత్రానికి థమన్ అందించిన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెరకెక్కించగా, నిర్మాతలు సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ త్వరలో వరుస సినిమాలతో పలకరించనున్నట్టు తెలుస్తుంది. ఓజీ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి.
