Broken Guitar | విధాత: ఓ వ‌స్తువుకు దానిని వాడిన వారి వ‌ల్ల విలువ పెరుగుతుంద‌ని మ‌రోసారి రుజువ‌య్యింది. ప్ర‌స్తుతం తీగ‌లు తెగి మూల‌న‌ప‌డిన ఓ గిటారుకు.. గ‌తంలో ఓ ప్ర‌ఖ్యాత సంగీత క‌ళాకారుడు ఉప‌యోగించిన కార‌ణంగా వేలంలో రూ.5 కోట్ల ధ‌ర ప‌లికింది. అమెరికాలోని ఒక‌ప్పుడు బాగా ఫేమ‌స్ అయిన నిర్వాణ మ్యూజిక్ బ్యాండ్‌లో లీడ్ సింగ‌ర్ అయిన క‌ర్ట్ కొబైన్ ఆ గిటార్‌ను వాయించాడు. 1994లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కొబైన్ అంత‌కు నాలుగేళ్ల ముందు […]

Broken Guitar |

విధాత: ఓ వ‌స్తువుకు దానిని వాడిన వారి వ‌ల్ల విలువ పెరుగుతుంద‌ని మ‌రోసారి రుజువ‌య్యింది. ప్ర‌స్తుతం తీగ‌లు తెగి మూల‌న‌ప‌డిన ఓ గిటారుకు.. గ‌తంలో ఓ ప్ర‌ఖ్యాత సంగీత క‌ళాకారుడు ఉప‌యోగించిన కార‌ణంగా వేలంలో రూ.5 కోట్ల ధ‌ర ప‌లికింది.

అమెరికాలోని ఒక‌ప్పుడు బాగా ఫేమ‌స్ అయిన నిర్వాణ మ్యూజిక్ బ్యాండ్‌లో లీడ్ సింగ‌ర్ అయిన క‌ర్ట్ కొబైన్ ఆ గిటార్‌ను వాయించాడు. 1994లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కొబైన్ అంత‌కు నాలుగేళ్ల ముందు నెవ‌ర్‌మైండ్ అనే ఆల్బం రూప‌క‌ల్ప‌న‌లో దీనిని ఉప‌యోగించాడు.

అంతేకాకుండా దీనిపై ఆ బ్యాండ్‌కు చెందిన ముగ్గురు స‌భ్యుల సంత‌కాలు కూడా ఉండ‌టం విశేషం. దీనిని
రిపేర్ చేసి ప‌లికిద్దామ‌ని చూసినా కుద‌ర‌క‌పోవ‌డంతో అలా ప‌క్క‌న పెట్టారు.

తాజాగా న్యూయార్క్‌లోని హార్డ్ రాక్ కేఫ్‌లో జ‌రిగిన వేలంలో అనుకున్న దానిక‌న్నా 10 రెట్లు ఎక్కువ ధ‌రకు పాడుకుని రూ.5 కోట్ల‌కు దానిని ఓ అజ్ఞాత వ్య‌క్తి ద‌క్కించుకున్నాడు.

అయితే ఇదే అత్యంత ధ‌ర ప‌లికిన గిటార్ కాదు. రెండేళ్ల క్రితం కొబైనే ఉప‌యోగించిన మ‌రో గిటార్ వేలంలో సుమారు రూ.50 కోట్ల‌కు అమ్ముడుపోయింది

Updated On 22 May 2023 6:15 AM GMT
krs

krs

Next Story