బీఆర్ఎస్ అంటే బందీపోట్ల రాష్ట్ర స‌మితి అధికారం అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్ ల్యాండ్‌, మైనింగ్ మాఫియా న‌డిస్తుండు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై సోయిలేని ఎమ్మెల్యే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు తోడు దొంగ‌ల‌ని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర స‌మితి అని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి లు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ […]

  • బీఆర్ఎస్ అంటే బందీపోట్ల రాష్ట్ర స‌మితి
  • అధికారం అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్ ల్యాండ్‌, మైనింగ్ మాఫియా న‌డిస్తుండు
  • నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై సోయిలేని ఎమ్మెల్యే
  • హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు తోడు దొంగ‌ల‌ని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర స‌మితి అని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి లు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛార్జ్ షీట్ విడుదల చేశారు.

అనంత‌రం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. కల్వకుంట కుటుంబం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయింద‌ని విమర్శించారు. సీఎం కేసీఆర్ దోపిడీకి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో కమలం, గులాబీ పార్టీలు కుమ్మక్కైయ్యాయని దుయ్యబట్టారు.

అధికారం అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్ ల్యాండ్‌, మైనింగ్ మాఫియా న‌డిస్తుండ‌ని ఆరోపించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు రోజుకో కొత్త డ్రామాతో ప్రజల ముందుకు వస్తున్నారని విరుచుకుపడ్డారు.కేసీఆర్ అవినీతి సొమ్ము అంటూ బీజేపీ నేతలు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.

పైకి ఒకిరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా.. లోపల మాత్రం టీఆర్ఎస్ , బీజేపీ నేతలు కలిసి పోయారని విమర్శించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను బలిచేసేలా నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌పై పెరుగుతున్న అసంతృప్తిని బయటకు కనిపించనీయకుండా కూడబలుక్కుని ఆందోళనలు చేస్తున్నారన్నారు.

అభివృద్ధిపై సోయి లేని ఎమ్మెల్యే

హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ తో హుస్నాబాద్ నియోజవర్గాన్ని అభివృద్ధి చేయడంలో వెనకంజలో ఉన్నారని వారు మండిప‌డ్డారు.హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్లమ్మ చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తామని చెప్పి అనేక రకాలుగా ఆర్థిక వనరులు సమకూర్చిన అభివృద్ధి విషయంలో కనబడడం లేదని భారత రాష్ట్ర సమితి నాయకులకు ఎల్లమ్మ చెరువు కట్ట మనీ ట్యాంకుబండగా మారిందని ఎద్దేవా చేశారు. పత్తి వ్యాపారుల వద్ద కమిషన్ తీసుకుంటూ రైతులను మోసగించిన ఎమ్మెల్యే సతీష్ బాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులు ఎన్నడో పూర్తి కావాల్సి ఉన్న వీటికంటే వెనుకకు మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం చూస్తుంటే హుస్నాబాద్ ప్రాంతం పై వీరికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని నిరూపణ అయిందని ఇట్టి విషయాన్ని ప్రజలు గ్రహించి రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు.

ముఖ్యమంత్రి తరచు ఎమ్మెల్యే ఇంటికి వస్తూ పోతూ ఉంటారని అంతటి ఎమ్మెల్యేతో హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని నర్సారెడ్డి, ప్రవీణ్ రెడ్డి లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated On 4 March 2023 2:13 AM GMT
krs

krs

Next Story