Tuesday, January 31, 2023
More
    Homelatestరూ.480 కోట్లకు చేరిన.. BRS ఆస్తుల విలువ

    రూ.480 కోట్లకు చేరిన.. BRS ఆస్తుల విలువ

    • బంగారు తెలంగాణాల.. బంగారు పార్టీ!
    • బీఆర్ఎస్‌కు విరాళాల వెల్లువ!

    విధాత‌: అధికారంలో ఉన్నోళ్లకు పైసలకు కొరతేముంది. కుక్కను కొట్టినా పైసలు రాలవట్టె. గిప్పుడు తెలంగాణాల సుత అధికార బీఆర్ఎస్ పార్టీకి కోట్లకు కోట్లు విరాళాలు రావట్టే. ఎందుకు రావు బిడ్డా. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు.. సినిమావాళ్ళు.. వ్యాపారులు.. గిట్ల ఎవరైనా సరే మనోళ్లు అడిగితే ఇచ్చుడే.. ఇయ్యకుంటే ఎట్లుంటాదో ఎరికే కదా..

    మళ్ళీ సినిమా వాళ్లను డ్రగ్స్ కేసులు వెంటాడుతాయ్.. పరిశ్రమల మీదకు రూల్స్.. నిబంధనలు దాడి చేస్తాయి.. ఎందుకొచ్చిన లొల్లి అంటూ ఆల్లే పైసలు తెచ్చి ఇస్తారు. మొత్తానికి బంగారు తెలంగాణల అధికార పార్టీ అయితే బంగారుమయం అయింది. విరాళాలు మస్తుగా వచ్చి పడుతున్నాయి.

    భారత రాష్ట్ర సమితి

    కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం.. పార్టీ ఆదాయం 2021-22 మధ్యకాలంలో రూ.37.65 కోట్ల నుంచి రూ.218.11 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్టీ వెల్లడించింది.

    ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేదు. ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఏడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది. బ్యాంకులు పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాలపరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిపాజిట్లు రూ.256 కోట్ల మేర ఉన్నాయి.

    2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దాదాపు 218.11 కోట్ల రూపాయల విరాళాన్ని అందుకోగా తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) 62.90 లక్షల రూపాయలు మాత్రమే విరాళం అందిందని రాజకీయ పార్టీల సహకార నివేదికలు వెల్లడించాయి.

    ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి అత్యధిక విరాళాలు అందాయని టీఆర్ఎస్ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. వ్యక్తులు లేదా కంపెనీలు లేదా సంస్థల నుండి రూ. 90 లక్షలు అందుకోగా వివిధ ఎలక్టోరల్ ట్రస్టుల నుండి రూ. 40 కోట్లు అందుకుంది.

    అదేవిధంగా 2021-22 సంవత్సరంలో టీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు పొందింది. మరోవైపు 2021-22 సంవత్సరంలో 24 మంది వివిధ దాతల నుండి టీడీపీ రూ.6290120 పొందింది.

    ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీ కోశాధికారి లేదా దాని ద్వారా అధికారం పొందిన మరేదైనా వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా వ్యక్తి లేదా ఇతర సంస్థల నుండి పార్టీకి స్వీకరించిన రూ. 20000 కంటే ఎక్కువ విరాళం గురించి నివేదికను సిద్ధం చేస్తారు. వాటిని ప్రకటిస్తారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular