Tuesday, January 31, 2023
More
    Homeతెలంగాణ‌మోసపు హామీలతో అధికారంలోకి BRS: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

    మోసపు హామీలతో అధికారంలోకి BRS: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

    విధాత: మోసపు హామీలతో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చారని నల్గొండ ఎంపీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల విస్తృత సమావేశంలో మాజీ సీఎల్పి లీడర్ కుందూరు జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ఓట్ల కోసం బూటకపు మాటలు చెబుతూ అన్ని వర్గాల ప్రజలను భ్రమల్లో పెట్టి, మోసం చేశారని ఆరోపించారు. మంత్రులు, పోలీసులు చేస్తున్న అరాచకాలపై ప్రజలు అసంతృప్తి తో ఉన్నారన్నారు.

    మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి మాట్లాడుతూ మోసపు మాటలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ను దించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ప్రభుత్వ అవినీతిని వైఫల్యాలను కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావ శంకర్ నాయక్, నాయకులు కర్నాటి లింగారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి నారాయణ గౌడ్, కుందూరు వెంకటరెడ్డి, వెంపటి శ్రీనివాస్, చింతల చంద్ర, గౌని రాజ, రమేష్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు.

    హుజూర్‌న‌గ‌ర్‌లో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్‌న‌గర్ లో కాంగ్రెస్ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె.జానారెడ్డి ముఖ్యఅతిథిగా ఉత్తమ్ తోపాటు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ భారత స్వతంత్ర సాధన ఉద్యమం నుండి ఆధునిక భారత నిర్మాత నిర్మాణం వరకు దేశ ప్రగతిలో చేసిన కృషిని కొనియాడారు. పార్టీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు దేశంలో, రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలో తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.

    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో నిర్వహించాలని సూచించారు.

    నల్గొండజ్ సూర్యాపేట, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు కోలాహలంగా నిర్వహించాయి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular