విధాత‌: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సదస్సు ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని కేసీఆర్‌ నిర్వహించారు. సభను లక్షలాది మందితో సక్సెస్‌ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు సీఎం సమీక్ష చేసి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మినహా అందరు నేతలు హాజరయ్యారు. దీంతో పొంగులేటి కారు దిగినట్టుగానే అనుకోవాలి. ఎందుకంటే కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే ఇంతకాలం తాను పార్టీలో కొనసాగాను అని చెప్పిన ఆయన సమయం, సందర్భం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ అధిష్ఠాన […]

విధాత‌: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సదస్సు ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని కేసీఆర్‌ నిర్వహించారు. సభను లక్షలాది మందితో సక్సెస్‌ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు సీఎం సమీక్ష చేసి వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మినహా అందరు నేతలు హాజరయ్యారు. దీంతో పొంగులేటి కారు దిగినట్టుగానే అనుకోవాలి. ఎందుకంటే కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే ఇంతకాలం తాను పార్టీలో కొనసాగాను అని చెప్పిన ఆయన సమయం, సందర్భం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ అధిష్ఠాన వైఖరిపై అన్నివిషయాలు చెబుతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజేయ్‌ వల్లనే మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి ఇబ్బందులు పడ్డారన్నది వారి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. పార్టీలో కుట్రల గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలు దానికి బలం చేకూర్చాయి.

పార్టీలో ప్రాధాన్యం, ఇతర సమస్యలు ఉంటే కేసీఆర్‌ పరిష్కరిస్తారని, ఆయన వద్దే తేల్చుకోవాలన్న మంత్రి అంతటతో ఆగకుండా తనపై ఆరోపణలు చేస్తున్నవారిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. బహిరంగ సభ దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య విభేదాలు సమసిపోలేదని ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమౌతుంది.

ఈ నేపథ్యంలోనే మంత్రి పువ్వాడ అజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. 'ఖమ్మంలో కొంతమంది పనికిమాలిన‌ బ్యాచ్‌ ఉన్నది. వారికి అబద్ధాలు చెప్పడం తప్పా ఏమీ తెలియదు. బీజేపీ వాళ్లకు ఉన్నట్టు ఒక అబద్ధాల గ్రూప్‌ ఉన్నది. అజయ్‌ కూకట్‌పల్లికి పోతుండు అని ప్రచారం మొదలుపెట్టారని' మంత్రి మండి పడ్డారు.

మంత్రి ఎవరిని ఉద్దేశించి అన్నారన్నది స్పష్టంగా తెలియదు. కానీ మంత్రి వైఖరిపై పరోక్షంగా విమర్శలు చేసింది తుమ్మల, పొంగులేటి వర్గమే. ప్రస్తుతం పొంగులేటి బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. ఇగ మిగిలింది తుమ్మలనే.

మంత్రి మాటలు ఆయనను ఉద్దేశించి చేసినవా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది తెలియదు. కానీ రాజకీయాల్లో కుట్రలు సహజమని వాటిని తట్టుకుని ముందుకు వెళ్లాలని సూచించిన మంత్రికి సీఎం భేటీ తర్వాత తుమ్మల వర్గానికి ఏమైనా ప్రాధాన్యం పెరిగిందా? లేక జిల్లా మంత్రిగా అందరినీ కలుపుకుని వెళ్లాలని కేసీఆర్‌ గట్టిగా చెప్పారా? అన్నది తేలాల్సి ఉన్నది.

తాను ఒకటి అనుకుంటే సీఎం భేటీ తర్వాత అది రివర్స్ అయ్యిందా? అందుకే మంత్రి పార్టీలో పనికిమాలిన బ్యాచ్‌ అని, వారికి అబద్ధాలు చెప్పడం తప్పా ఏమీ తెలియదు అని విమర్శలు చేశారా అని జిల్లాలో చర్చించుకుంటున్నారు. బహుశా మంత్రి ఈ వ్యాఖ్యలు తుమ్మల వర్గాన్ని ఉద్దేశించినవే అనే వాదనలు ఉన్నాయి.

Updated On 17 Jan 2023 1:12 AM GMT
krs

krs

Next Story