BRS టికెట్ దక్కిన వారు అందరిని కలుపుకు పోవాలి విధాత : ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు ఎవరైనా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీని గెలిపించుకోవాల్సిందేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ టికెట్ దక్కిన వారు అసమ్మతి లేకుండా అందరిని కలుపుకు పోవాలన్నారు. అభ్యర్థులను మార్చినా మార్చకున్నా పార్టీని గెలిపించు కోవాల్సిన అవసరం […]

BRS

టికెట్ దక్కిన వారు అందరిని కలుపుకు పోవాలి

విధాత : ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు ఎవరైనా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీని గెలిపించుకోవాల్సిందేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

పార్టీ టికెట్ దక్కిన వారు అసమ్మతి లేకుండా అందరిని కలుపుకు పోవాలన్నారు. అభ్యర్థులను మార్చినా మార్చకున్నా పార్టీని గెలిపించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఓర్పు చాలా అవసరమని, ప్రస్తుతం నాయకుల్లో ఓపికలు తగ్గాయన్నారు. గ్రూపులు కట్టడానికి, అసాంఘిక శక్తులకు నేను దూరమని, పాముకు పాలు పోసి పెంచొద్దన్నారు. రాజకీయాల్లో కులాలకు, మతాలకు ప్రాధాన్యత ఉండదని, ప్రజలకు మమేకమైన వారికే ఆదరణ ఉంటుందన్నారు.

తమ మధ్య ఉండే సమస్యలను కొంత మంది నేతలు కులాలకు ఆపాదిస్తున్నారన్నారు. నా రాజకీయ జీవితంలో ఆరోపణలు కేసులు లేవన్నారు. నేనెవరి పనుల్లో జోక్యం చేసుకోనని, గౌరవ ప్రదమైన బాధ్యతల్లో ఉన్నానని, గౌరవ ప్రదంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిక్లరేషన్స్ అన్ని అమలు సాధ్యం కావన్నారు.

Updated On 31 Aug 2023 3:16 AM GMT
krs

krs

Next Story