ఊడగొట్టిన నాగళ్లతో ఎవుసం అయ్యేనా!! విధాత‌: మొత్తానికి కేసీఆర్ తాను అనుకున్నట్లుగానే BRS పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగాన్ని అధికారికంగా ఏర్పాటు చేసేస్తున్నారు. ఇంతవరకైతే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు ఇంకో ఇద్దరు, ముగ్గురు పార్టీలో చేరారు. అయితే ఊడగొట్టి పక్కన పడేసిన నాగళ్ల వంటి ఈ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుందా.. వీళ్ళు పార్టీని లాగగలరా.. కొత్తవాళ్ళు ఎవరెవరు వస్తారు.. మున్ముందు పార్టీ భవిష్యత్ ఏమిటన్న దాని మీద బోలెడు సందేహాలు వస్తున్నాయి బీఆర్ఎస్ […]

  • ఊడగొట్టిన నాగళ్లతో ఎవుసం అయ్యేనా!!

విధాత‌: మొత్తానికి కేసీఆర్ తాను అనుకున్నట్లుగానే BRS పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగాన్ని అధికారికంగా ఏర్పాటు చేసేస్తున్నారు. ఇంతవరకైతే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు ఇంకో ఇద్దరు, ముగ్గురు పార్టీలో చేరారు. అయితే ఊడగొట్టి పక్కన పడేసిన నాగళ్ల వంటి ఈ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుందా.. వీళ్ళు పార్టీని లాగగలరా.. కొత్తవాళ్ళు ఎవరెవరు వస్తారు.. మున్ముందు పార్టీ భవిష్యత్ ఏమిటన్న దాని మీద బోలెడు సందేహాలు వస్తున్నాయి

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు. 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా ఉండరనే పేరుంది

ఇక రావెల కిశోర్ బాబు సైతం రైల్వే అధికారిగా రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయనకు చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చాన్సు ఇచ్చారు. అయితే రావెల, ఆయన కుమారుడి అరాచకాలు పెచ్చుమీరడంతో చంద్రబాబు ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో కిశోర్ బాబు జనసేనలో చేరి 2019లో జనసేన తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి వచ్చారు.

అలాగే చింతల పార్థసారధి కూడా కేంద్రంలో ఉన్నతాధికారిగా చేస్తూ 2019లో జనసేన తరఫున అనకాపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత తుమ్మలశెట్టి జయప్రకాష్‌ నారాయణ కూడా బీఆర్ఎస్‌లో చేరారు. 2008లో ప్రజారాజ్యంలో చేరిన ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇలా పార్ట్ టైం రాజకీయాలు, ఏరోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని నాయకులను బీఆర్ఎస్‌లో చేర్చుకుని కేసీఆర్ ఆంధ్రాలో ఏమి సాధిస్తారని సందేహాలు వస్తున్నాయి. మున్ముందైనా రెగ్యూలర్, సీరియస్ నాయకులు గానీ చేరితే పార్టీ ఏమైనా ముందుకు రెండడుగులు వేస్తుందని, లేదంటే ఇది ఇక్కడితో ముగిసిపోతుందని అంటున్నారు.

Updated On 4 Jan 2023 4:32 AM GMT
krs

krs

Next Story