BRSలో చేరిన అల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ సమితి అధ్యక్షుడు
విధాత: దేశ రాజకీయాలలో భవిష్యత్ మొత్తం BRSదేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి జరుగుతున్న అభివృద్ధి , అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటు వైపే చేస్తుందన్నారు.
సూర్యాపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ కమిటీ పోరాట సమితి అధ్యక్షుడు యండి ఖాలేద్ అహ్మద్ ఆదివారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో BRSలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమ తమ ప్రాంతాలను తెలంగాణాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ అదే పనిగా ఉదర గొడుతున్న BJP ఎలుబడిలోని కర్ణాటక రాష్ట్రంలోనూ ఈ డిమాండ్ వస్తున్న అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. పార్టీలో చేరిన యండి ఖాలేద్ అహ్మద్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, 21వ వార్డు ఇంచార్జ్ రహీం (పిల్లు), మున్సిపల్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్, సీనియర్ నాయకులు సయ్యద్ సలీం, బైరు వెంకన్న గౌడ్, మద్ది శ్రీనివాస్, యాదవ్ గౌస్ ఖాన్,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.