Saturday, January 28, 2023
More
    Homelatestనల్గొండ: BRSలో పోస్టర్ల రచ్చ.. కంచర్లపై చాడ వర్గం ఫైర్!

    నల్గొండ: BRSలో పోస్టర్ల రచ్చ.. కంచర్లపై చాడ వర్గం ఫైర్!

    • సోష‌ల్ మీడియాలో చాడ వ‌ర్గం మండిపాటు

    విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, వచ్చే ఎన్నికల్లో ఆయనకు పోటీగా పార్టీ టికెట్ ఆశిస్తున్న నాయకులకు మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోజురోజుకు రకరకాలుగా తీవ్రమవుతుంది. కంచర్ల కు పోటీగా టికెట్ రేసులో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, పిల్లి రామరాజు, గుత్తా అమిత్ రెడ్డి ఇటివల తమ జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో, గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, వాల్ పోస్టర్లతో హంగామా చేశారు.

    వారి హంగామా సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు పోటీ అన్నట్లుగా జనంలో ప్రచారం పొందింది. ఇదంతా పక్కన పెడితే నల్గొండ పట్టణంలో రద్దీ ప్రాంతాల్లో వేసిన చాడ కిషన్ రెడ్డి వాల్ పోస్టర్ల పైన ప్రవైట్ కోచింగ్ సెంటర్ల ప్రచార పోస్టర్లను అంటించారు. వాటిని కావాలనే కంచర్ల వర్గీయులు తమ నాయకుల పోస్టర్లపై వేయీంచారంటూ చాడ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

    ముఖ్యంగా చాడ కిషన్ రెడ్డి వర్గీయులు మాత్రం ఈ వ్యవహారం వెనుక పరోక్షంగా కంచర్ల ప్రమేయం ఉందంటూ మండిపడుతున్నారు. సూర్యున్ని, ప్రజాదరణ పొందుతున్న నాయకున్ని ఆపడం మీ తరం కాదంటూ చాడ కిషన్ రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టులతో ఫైర్ అవుతున్నారు.

    నల్గొండ నియోజకవర్గంలో కొంతమంది బిఆర్ఎస్ నాయకులు పనికట్టుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ పేరుతో కిషన్ రెడ్డి వాల్ పోస్టర్ల మీద కావాలని తమ సొంత ఖర్చులతో పోస్టర్లు వేపిస్తున్నారని వారు తమ పోస్టుల్లో ఆరోపిస్తున్నారు. చాడ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను, పోస్టర్లను అధికార అండతో తీయించిన సదరు నాయకులు ఈ క్షణం సంబర పడొచ్చు కానీ.. ప్రజలలో ఉన్న ముద్ర చేరపలేరన్నారు.

    20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి అని, సీఎం కేసిఆర్ మాటకు తలొగ్గి ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థి గెలుపు కోసం తన శాయాశక్తులా కృషి చేస్తానని చెప్పి చేశారన్నారు. ఆ విషయం యావత్ నియోజకవర్గానికి తెలిసినప్పటికి సొంత పార్టీ నాయకులకు అర్థం కావడం లేదని, ఇకనైనా తమ కుటిల బుద్ధి మార్చుకుంటే మంచిదంటూ చాడ కిషన్ రెడ్డికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular