- ప్రకటించిన ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య
Buddhist Dhamma prophecies in Buddhavanam
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధ వనములోని మహాస్థూపంలో రేపటి నుండి ఇండియన్ – థాయ్ బౌద్ధ భిక్షువు అరుణో బౌద్ధ ధమ్మ ప్రవచనాలు వినిపిస్తారని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
థాయిలాండ్‌కు చెందిన దమ్మ యూత్ సంప్రదాయంలో ప్రసిద్ధ థాయ్ బౌద్ధ గురువు అజాన్మున్ గురువు వద్ద శిక్షణ పొందిన అరుణో భిక్షు 15 రోజుల దమ్మవాసానికై బుద్ధ వనానికి వచ్చారని, ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు బుద్ధ వనములోని మహాస్తూపములో దమ్మ ప్రవచనం చేస్తారని తెలిపారు.
ఆసక్తిగల బౌద్ధాభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరింత సమాచారం కావలసిన వారు బుద్ధ వనం సూపర్వైజర్ విష్ణు ఫోన్ నెంబర్8341280618ను సంప్రదించవచ్చని తెలిపారు.