Karnataka విధాత: సరిగ్గా 58 ఏండ్ల క్రితం ఓ రెండు బర్రెలు, దూడను ఇద్దరు వ్యక్తులు దొంగిలించారు. ఆ తర్వాత వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెయిల్ అనంతరం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని 58 ఏండ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మెహ్‌కర్ గ్రామానికి చెందిన మురళీదర్ రావు కులకర్ణి అనే వ్యక్తికి రెండు బర్రెలు, ఒక దూడ ఉన్నాయి. అయితే ఈ మూగ […]

Karnataka
విధాత: సరిగ్గా 58 ఏండ్ల క్రితం ఓ రెండు బర్రెలు, దూడను ఇద్దరు వ్యక్తులు దొంగిలించారు. ఆ తర్వాత వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెయిల్ అనంతరం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని 58 ఏండ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మెహ్‌కర్ గ్రామానికి చెందిన మురళీదర్ రావు కులకర్ణి అనే వ్యక్తికి రెండు బర్రెలు, ఒక దూడ ఉన్నాయి. అయితే ఈ మూగ జీవాలను గణపతి విట్టల్, కిషన్ చందర్ అనే ఇద్దరు వ్యక్తులు 1965, ఏప్రిల్ 25న దొంగిలించారు. వీరిద్దరు మహారాష్ట్రలోని ఉదగిర్‌కు చెందినవారు.
కులకర్ణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై విడుదలైన గణపతి, చందర్ కోర్టు ప్రోసిడింగ్స్‌కు హాజరు కాలేదు. కిషన్ చందర్ 2006, ఏప్రిల్ 11న మరణించాడు. ఇక గణపతికి సమన్లు, వారెంట్లు జారీ చేసినప్పటికీ స్పందించకుండా, తప్పించుకు తిరిగుతున్నాడు.
ఇక ఈ కేసును లాంగ్ పెండింగ్ రిపోర్టు కేసుగా నమోదు చేశారు. ఇటీవలే బీదర్ ఎస్‌పీ ఎస్ఎల్ చన్నబసవన్న లాంగ్ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం గణపతిని అదుపులోకి తీసుకున్నారు. బర్రెల దొంగతనం చేసినప్పుడు గణపతి వయసు 20 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు.
