Viral Video |
బర్రెలకు నీళ్లు కనిపిస్తే చాలు.. ఆ నీళ్ల వద్ద వాలిపోతుంటాయి. నీళ్లలో దిగి హాయిగా సేద తీరుతుంటాయి. అయితే ఓ బర్రెల మందకు కూడా నీళ్లు కనిపించాయి. అదేదో చెరువులోనూ, నదిలోనూ కాదు.. ఓ స్విమ్మింగ్ ఫూల్‌లో. ఇంకేముంది.. ఆ స్విమ్మింగ్ ఫూల్‌లో ఓ ఏడు బర్రెలు దూకాయి. ఆ బర్రెల జలకాలాటకు స్విమ్మింగ్ ఫూల్ దెబ్బతిన్నది.
ఆండీ, లినెట్టె స్మిత్ అనే దంపతులు.. ఉద్యోగ పదవీ విరమణ పొందారు. ఇక శేష జీవితాన్ని హాయిగా గడిపేందుకు తమకున్న స్థలంలోనే ఓ స్విమ్మింగ్ ఫూల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రకరకాల చెట్లను పెంచుకున్నారు. ఉన్నట్టుండి ఒక రోజు ఆ స్విమ్మింగ్ ఫూల్ పరిసర ప్రాంతాల్లోకి 18 బర్రెలు వచ్చాయి.
అందులో ఏడు బర్రెలు ఈత కొలనులో దూకాయి. దీంతో స్విమ్మింగ్ ఫూల్ ధ్వంసమైంది. బర్రెల చర్య వల్ల రూ. 25 లక్షల నష్టం వాటిల్లిందని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన చెట్లను కూడా బర్రెలు ధ్వంసం చేసి, హంగామా సృష్టించాయి.
It’s hot but it’s not that hot! Moment herd of escaped water #buffalo stampede through couple’s garden and take dip in their swimming pool – causing £25,000 in damage to their Colchester #Essex home pic.twitter.com/uYM8kZpwgP
— Hans Solo (@thandojo) May 23, 2023