Jasprit Bumrah | టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు. ఈ రోజు ఉదయం బుమ్రా సతీమణి సంజన పండంటి మగబిడ్డకు జన్మిన్వడంతో ఇరు కుటుంబాలతో పాటు బుమ్రా అభిమానుల లోను ఆనందం వెల్లివిరిసింది. అయితే తన కుమారుడకి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టినట్టుగా ఈ స్టార్ పేసర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. చిన్న కుటుంబం పెరిగి పెద్దదైంది. మా హృదయాలు ఇప్పుడు చాలా నిండుగా ఉన్నాయి. ఈ […]

Jasprit Bumrah |
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు. ఈ రోజు ఉదయం బుమ్రా సతీమణి సంజన పండంటి మగబిడ్డకు జన్మిన్వడంతో ఇరు కుటుంబాలతో పాటు బుమ్రా అభిమానుల లోను ఆనందం వెల్లివిరిసింది. అయితే తన కుమారుడకి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టినట్టుగా ఈ స్టార్ పేసర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
చిన్న కుటుంబం పెరిగి పెద్దదైంది. మా హృదయాలు ఇప్పుడు చాలా నిండుగా ఉన్నాయి. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. ఇది జీవితంలోని కొత్త అధ్యాయం కాగా, ఇప్పటి నుండి ప్రతీది కూడా ఆస్వాదిస్తాము అంటూ జస్ప్రీత్ బుమ్రా- సంజన పేరుతో సందేశాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
బుమ్రా తండ్రి అయ్యాడని తెలిసి ప్రతి ఒక్కరు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు బుమ్రా తనయుడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్న బుమ్రా ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌ల సమయానికి తిరిగి జట్టుతో కలవనున్నాడు.
సోమవారం పసికూన జట్టు నేపాల్‌తో జరగనున్న మ్యాచుకు బుమ్రా దూరం కానున్నాడు. పాక్‌పై అద్భుతమైన బ్యాటింగ్ చేసిన బుమ్రా ఉన్నట్టుండి స్వదేశానికి బయలుదేరడంతో అందరిలో లేని పోని అనుమానాలు ఏర్పడ్డాయి.ఎట్టకేలకి బుమ్రా పోస్ట్‌తో అందరిలో ఓ క్లారిటీ వచ్చేసింది. బుమ్రా సన్నిహితుల సమాచారం మేరకు బాబుకి తండ్రి పోలికలే వచ్చాయని అంటున్నారు.
ప్రస్తుతం ఇండియన్ క్రికెటర్ బుమ్రా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. టీమిండియాకి కూడా బుమ్రా పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇక నేపాల్ తో జరిగే మ్యాచ్ లో బుమ్రా అందుబాటులో ఉండడు కాబట్టి మొహమ్మద్ షమీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు నేపాల్ తో జరిగే మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతుంది.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా రద్దయితే అప్పుడు భారత్ సూపర్ 4కు చేరుకుంటుంది.పాక్‌తో మ్యాచ్‌లో వర్షం వలన ఒక భారత్ పాయింట్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
