విధాత: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచార‌ణ‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) వేగ‌వంతం చేసింది. విచార‌ణ‌పై హైకోర్టు స్టే ఎత్తేయ‌డంతో.. ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో నిన్న‌టి నుంచి ముగ్గురు నిందితులు రామ‌చంద్ర భార‌తి, నంద‌కుమార్, సింహాయాజిల‌ను సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం లోతుగా విచారిస్తోంది. నిన్న అనేక అంశాల‌పై విచారించిన సిట్.. ఇవాళ ఉద‌యం చంచ‌ల్‌గూడ జైలు నుంచి నేరుగా నాంప‌ల్లి ఎఫ్ఎస్ఎల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ వారి స్వ‌ర […]

విధాత: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచార‌ణ‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) వేగ‌వంతం చేసింది. విచార‌ణ‌పై హైకోర్టు స్టే ఎత్తేయ‌డంతో.. ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో నిన్న‌టి నుంచి ముగ్గురు నిందితులు రామ‌చంద్ర భార‌తి, నంద‌కుమార్, సింహాయాజిల‌ను సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం లోతుగా విచారిస్తోంది.

నిన్న అనేక అంశాల‌పై విచారించిన సిట్.. ఇవాళ ఉద‌యం చంచ‌ల్‌గూడ జైలు నుంచి నేరుగా నాంప‌ల్లి ఎఫ్ఎస్ఎల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ వారి స్వ‌ర నమూనాల‌ను సేక‌రించారు. బేరసారాల ఆడియో, వీడియోల వాయిస్‌తో అధికారులు వాటిని పోల్చి చూడనున్నారు. కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కీలకంగా కానున్నది.

ఏసీబీ కోర్టు అనుమ‌తితో ముగ్గురు నిందితుల‌ను గురువారం ఉద‌యం సిట్.. త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్న విష‌యం విదిత‌మే. నిన్న వారిని 42 ప్ర‌శ్న‌లు అడిగారు. అయితే 17 ప్ర‌శ్న‌ల‌కు ముగ్గురు వేర్వేరు స‌మాధానాలు ఇచ్చారు.

దీంతోపాటు విచారణలో వెల్లడవుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ముంబయి, హర్యానా తదితర రాష్ర్టాలకు ప్రత్యేక బృందాలను పంపేందుకు తెలంగాణ పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Updated On 11 Nov 2022 11:13 AM GMT
krs

krs

Next Story