Thursday, March 23, 2023
More
  Homelatestఅసలు గుట్టు విప్పిన బీవిఎస్ రవి..!

  అసలు గుట్టు విప్పిన బీవిఎస్ రవి..!

  విధాత‌: టాలీవుడ్ లో మచ్చ రవిగా రచయిత బీవిఎస్ రవికి ఓ గుర్తింపు ఉంది. పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన వాంటెడ్, జవాన్ వంటి చిత్రాలను తీశారు. దర్శకునిగా మారి ఈ రెండు చిత్రాలను తెరకెక్కించినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. తాజాగా ఈ విషయంపై బీవిఎస్ రవి కొన్ని కామెంట్స్ చేశారు.

  గోపీచంద్ హీరోగా తాను దర్శకత్వం వహించిన వాంటెడ్ చిత్రానికి ముందు నాకు దర్శకుడుగా అనుభవం లేదు. అదే ఆ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది అని తెలిపారు. ఇక జవాన్ చిత్రం గురించి మాట్లాడుతూ ఇది ఒక యాక్షన్ థ్రిల్ల‌ర్. దిల్ రాజు పర్యవేక్షణలో కృష్ణ నిర్మించారు. నేను చాలా అంచనాలే పెట్టుకున్నాను.

  కానీ నాకు ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఫ్యామిలీ మూవీస్ పైపట్టున్న దిల్ రాజు ఈ మూవీ విషయంలో జడ్జిమెంట్ చేయలేకపోయారు. తన అనుభ‌వ లేమితో సినిమా ఫస్ట్ కాపీ చూసేసి రాజు తనకు నచ్చినట్టుగా మార్చేశారు. ఇక అదే సమయంలో ధృవ రిలీజ్ కూడా ఉంది. ఆ సినిమాకు మా సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయని తెలిసింది.

  దాంతో సాయి ధరంతేజ్ దానికి ముందుగా వెళ్లడం మంచిది కాదు అన్నారు. నాకు ఫ్యామిలీ ముఖ్యమని చెప్పడంతో చేసేది లేక ఆలస్యంగా రిలీజ్ చేసాం. అదే మాకు ప్రధానమైన మైన‌స్ గా మారింది. థాంక్యూ కూడా మా ఫ్యామిలీలో పుట్టిన కథ. దాన్ని డెవలప్ చేశాను. శ్రీనివాస కళ్యాణం సక్సెస్ అయ్యి ఉంటే థాంక్యూ నేనే చేసే వాడిని.

  ఈ కారణం వల్లనే ఈ ప్రాజెక్టు విక్రమ్ కుమార్ దగ్గరకు వెళ్ళింది అని చెప్పుకొచ్చారు. దర్శకుడిగా అల్లు అరవింద్ తనకు ఆఫర్ ఇచ్చారు. అందుకు అడ్వాన్స్ కూడా అందించారు. అడ్వాన్స్ వల్లే తనకు అన్ స్టాపబుల్ షో అప్పగించారని బివిఎస్ రవి చెప్పుకొచ్చారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular