Sunday, December 4, 2022
More
  Homelatestపంచుడే తరువాయి.. ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం

  పంచుడే తరువాయి.. ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం

  • ఓటర్లకు తాయిలాలు

  విధాత‌: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న.. దేశంలో నే అతి ఖరీదైన ఉప ఎన్నికగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ప్రచార పర్వం అధ్యంతం పోటా పోటీగా సాగగా చివరి రోజు పలివెలలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తంగా ముగిసింది. ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలే కాకుండా చిన్న పార్టీల వారు కూడా పెద్ద సంఖ్యలో మునుగోడులో మోహరించి.. అద్దెకు ఇల్లు కూడా దొరకని పరిస్థితిలో చివరకు తాత్కాలిక గుడారాలు కూడా ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో మకాం వేసి ప్రచారం నిర్వహించారు.

  రణరంగంలా మారిన మునుగోడు.. రాళ్ల దాడి.. పరిస్ధితి ఉద్రిక్తం (వీడియో)

   

  ప్రచార పర్వ ముగిసిపోవడంతో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులంతా తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో డీజేలు మైక్ సెట్ లతో హోరెత్తిన ప్రచారం మంగళవారం సాయంత్రానికి మూగబోయింది. ప్రచారంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు బీఎస్పీ ఇతర పార్టీల నేతలు గెలుపు సాధనకు ఓటర్లను ఆకర్షించేందుకు బహిరంగసభలు, రోడ్ షోలు, కుల సంఘాల ఆత్మీయ సమావేశాలు, విందులు, ఎన్నికల హామీల పర్వంతో గట్టి ప్రయత్నం చేశారు.

  శృంగార సుగంధ ద్రవ్యాలు ఇవే.. ఆ సమస్యలను దూరం చేసుకోండి..

  ఈ ఎన్నికల్లో ఓడితే రానున్న సాధారణ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతో టీఆర్ఎస్, గెలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ఆశతో బీజేపీ, కాంగ్రెస్ లు గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డి ప్రచారం సాగించారు. టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీఆర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ రెండు పర్యాయాలు బహిరంగ సభలకు హాజరయ్యారు. అపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు గ్రామాల వారిగా టీఆర్ఎస్ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు.

  Munugode: మూడున్నరేండ్లలో చేయనిది.. ఏడాదిలో ఎలా?

   

  మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచార పరవంలో గులాబీ శ్రేణులతో కలిసి బీజేపీని ఓడించాలని ఓటర్లను అభ్యర్థించారు. మధ్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని షేక్ చేయగా బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్, టీఆర్ఎస్‌లోకి స్వామి గౌడ్, భిక్షమయ్య గౌడ్, శ్రవణ్‌లు రాపోలు భాస్కర్, పల్లె రవి  చేరడంతో ప్రచార పర్వంలో వలసల పరాకాష్ట కనిపించింది.

  తమ్ముడికి తన భార్యనిచ్చి పెళ్లి చేసిన అన్న.. ఎందుకంటే..?

  అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు విస్తృత ప్రచారం సాగించారు. తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధి సాధ్యమని భావించి ఉప ఎన్నికకు సిద్ధపడ్డానని మళ్లీ తనని గెలిపించి మునుగోడును నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని రాజగోపాల్ రెడ్డి ఓటర్ల అభ్యర్థించారు. తన తండ్రి నియోజకవర్గంలో చేసిన సేవలను గుర్తు చేసుకొని మునుగోడు కాంగ్రెస్ అడ్డ అని నిరూపించాలని పాల్వాయి స్రవంతి ఓటర్లని గెలుపు కోసం అభ్యర్థించారు.

  ఇంకోసారి ఓటేస్తే.. బీజేపీ దేశాన్ని అమ్మేస్తుందా ?

  టీజేఎస్, బీఎస్పీ పార్టీలు సైతం పోటీలో ఉన్న ఆ పార్టీలు చీల్చే ఓట్లు ప్రధాన పార్టీలో ఎవరికి లాభనష్టాలు కలిగిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది .ప్రచార పర్వంలో కేఏ పాల్ అధ్యఅంతం విభిన్న వేషధారణలతో వినోదాత్మకంగా సాగించిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. ఇక ఉప ఎన్నిక ప్రచార ఘట్టంలో మద్యం , మాంసం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించడం ఈ ఎన్నికలో పార్టీలు చేస్తున్న వ్యయానికి నిదర్శనంగా నిలిచింది.

  ఒకే ఒక్కడు.. జనరంజకుడు… KA పాల్‌

   

  ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడతంతో నేటి సాయంత్రం 6 గంటల తర్వాత సామాజిక మాధ్యమాల్లో కూడా ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నవంబర్ మూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 41.855మంది ఓటర్లు ఉండగా, 5,685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.

  ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. 65 ఏండ్లలో ఒకేసారి స్నానం

  ఉప ఎన్నికల్లో 298 పోలింగ్ కేంద్రాలు, 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఆయా పోలింగ్ స్టేషన్లో ఎన్నికల అధికారులు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కోసం ఏర్పాటు చేశారు. 298 పోలింగ్ కేంద్రాలలో అర్బన్ ప్రాంతంలో 35 పోలీస్ కేంద్రాలు ఉండగా రూరల్లో 253 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్లకు కొత్త ఓటర్ కార్డులు పంచారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్లు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికల బందోబస్తులో 5,500మంది పోలీసులు విధులు నిర్వర్తించరన్నారు. మద్యం డబ్బుల పంపిణీ అరికట్టేందుకు వందకు పైగా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు.

  ప్రస్తుతం భారతీయులను కలవర పెడుతున్న 3 అంశాలివే..

  నాన్ మునుగోడు ఓటర్లు అక్కడ ఉండకూడదు

  ప్రచారం ముగిసిపోయినందున మునుగోడులో ఓటు హక్కు లేని వాళ్ళు అక్కడ ఉండకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది .మరోవైపు ఇప్పటివరకు మునుగోడులో 185 కేసులు నమోదు అయ్యాయని 6.80 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4683 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు రాజకీయ పార్టీల నాయకుల నుంచి కూడా వచ్చిన ఫిర్యాదులు కలుపుకొని 479 ఫిర్యాదులు అందాయి నేటి సాయంత్రం 6 గంటలకు మైకులు మూగపోయాయి . ప్రచార హోరు ఆగిపోయిన‌ ప్రలోభాలకు తెరలేసే అవకాశం ఉండడంతో ఎన్నికల సంఘం గట్టిగాను ఏర్పాటు చేసింది.

   

  ఈ ఆడబిడ్డను చంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం: రేవంత్

   

  ఇప్పటికే విచ్చలవిడిగా డబ్బులు పంచారని మద్యం ఏరులై పారుతుందని అని ఆరోపణలు విమర్శలు విలువస్తున్నాయి. ప్రచారం ముగిసిన తర్వాత ఇది మరింత ఊపందుకునే అవకాశం లేకపోలేదు. చిన్నాచితక పార్టీలు మినహాయిస్తే ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీలు జోరుగా డబ్బులు, మద్యం పంచుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

  కన్నతల్లితో అనుచిత ప్రవర్తన.. కొడుకును చంపించిన తల్లిదండ్రులు

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page