Sunday, December 4, 2022
More
  HomeBreakingమునుగోడు: ఉప ఎన్నిక ప్రశాంతం(90%).. రాత్రి 8 వరకు పోలింగ్

  మునుగోడు: ఉప ఎన్నిక ప్రశాంతం(90%).. రాత్రి 8 వరకు పోలింగ్

  విధాత: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం కల్లా ఊపందుకొని సాయంత్రం 6గంటల కల్లా మొత్తం 90 శాతంగా నమోదయింది. 2లక్షల 40,855 మంది ఓటర్లకు గాను పోలింగ్ గడువు సాయంత్రం 6గంటల వరకు 2లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పుంజుకోవడంతో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండటంతో చాలా గ్రామాల్లో రాత్రి 8గంటల వరకు కూడా పోలింగ్ సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో తొలి రెండు గంటల్లో 11.20% పోలింగ్ మాత్రమే నమోదు కాగా మధ్యాహ్నం 1 గంట కల్లా 41.3% పోలింగ్ నమోదయింది. 3గంటలకు 59.92 శాతం పోలింగ్, 5గంటల వరకు 77.5శాతం పోలింగ్ నమోదయింది.

  MUNUGODE: డబ్బులివ్వలేదని.. ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామాలు

  ప్రధాన రాజకీయ పార్టీలు టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు గెలుపు కోసం ఓటర్లను పోలింగ్ బూత్ లకు తరలించేందుకుపోటా పోటీగా ప్రయత్నాలు సాగించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మధ్యాహ్నం తర్వాతే పోలింగ్ పుంజుకోవడంతో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరగా, వారికి ఓటు వేసేందుకు కనీసంగా రెండు గంటలు వేచిచూడాల్సివచ్చింది. మధ్యాహ్నం 3గంటల నుంచి 5గంటల మధ్య ఏకంగా 20శాతం ఓటింగ్ పెరగడం గమనార్హం.

  కాగా కొండాపురం, కొంపల్లి, నారాయణపూర్, అల్లం దేవి చెరువు, చిన్న కొండూరుతో పాటు మొత్తం ఆరు చోట్ల ఈవిఎంలు, వివి ప్యాట్ లు సాంకేతిక లోపంతో మొరాయించగా పోలింగ్ ప్రక్రియకు అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. వృద్ధులు, మహిళలు , యువత పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. నారాయణపూర్ మండలం సర్వేల్ లో ఎన్నికల సంఘం మోడల్ మహిళా పోలింగ్ కేంద్రం సఖీని ఏర్పాటు చేసింది.

  రాజగోపాల్‌రెడ్డి అర్ధరాత్రి కేసీఆర్‌ను ఎందుకు కలిశారు?: కేఏ పాల్‌

  గ్రామాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు పోలింగ్ రోజు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపకాలకు దిగడంతో పరస్పరం అడ్డుకునే క్రమంలో పలు గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య స్వల్ప వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు మూడు చోట్ల నగదును, మద్యం పట్టుకొని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

  పోలింగ్ రోజు స్థానికేతరులు గ్రామాల్లో ఉండి టీఆర్ఎస్ తరఫున డబ్బు మద్యం పంపకాలు చేపట్టగా చండూర్, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో బిజెపి కార్యకర్తలు అడ్డుకొన్న సందర్భంలో తోపులాటలకు, లాఠీచార్జిలకు దారితీశాయి. పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారంటు, పట్టించిన నాన్ లోకల్ టిఆర్ఎస్ నాయకులను పోలీసులు వదిలి పెడుతున్నారని బిజెపి శ్రేణులు ఆరోపించారు. వారికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా లాఠీచార్జితో వారిని చెదరగొట్టారు.

  MUNUGODE: కూసుకుంట్లకు నిరసన.. రాజగోపాల్‌పై దాడి!

  టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు నారాయణపూర్ మండలం లింగంవారి గూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూరు మండలం ఇడు కుడా గ్రామ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ నారాయణ పూర్ మండల కేంద్రంలో ఓటు వేశారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ నేత అభ్యర్థి కే ఏ పాల్ పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

  ప్రధాన పార్టీలు గెలుపు సాధనకు ఇతర ప్రాంతాల్లో ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓటర్లను పెద్ద ఎత్తున తాయిలాలు, రవాణా చార్జీలు ఇచ్చి మరి పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం కనిపించింది. గట్టుప్పల్ మండలం రంగం తండావాసులు తమ గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని పట్టుబడుతూ మధ్యాహ్న వరకు ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు.

  యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

  స్థానిక నాయకులు అధికారుల హామీలతో వారు శాంతించి ఓటు వినియోగించుకున్నారు. చండూరు మండలం బంగారు గడ్డలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ గ్రామస్తులు పార్టీల నాయకులతో వాగ్వాదానికి దిగి ఆలస్యంగా ఓటు వేసేందుకు కదిలారు. అలాగే శివన్నగూడెం రిజర్వాయర్ నిర్వాసితుల గ్రామాల్లో సైతం ఓటర్లు పోలింగ్ కేంద్రాల కు నెమ్మదిగా రావడంతో ఓటింగ్ శాతం ఆలస్యంగా పెరిగింది.

  నగదు పంపిణీ ఆశల నేపథ్యంలో ఓటు వేయడంలో ఓటర్లు వేచి చూసే ధోరణితో వ్యవహరించడంతో మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పుంజుకోవడానికి కారణమైంది. దీంతో పోలింగ్ సమయం దగ్గర పడిన కొద్ది పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది.

  అప్సరా రాణి.. ఆ అందానికి ఎవ్వడైనా ఫిదా కావాల్సిందే!

  చివరకు పోలింగ్ గడువు సాయంత్రం 6 గంటల కల్లా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరడంతో పోలింగ్ ప్రక్రియ లో జాప్యం చోటుచేసుకుంది. ఎన్నికల అధికారులు 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లు అందరికీ ఓటు కల్పించేందుకు అవకాశం ఇవ్వడంతో కొన్ని గ్రామాల్లో ఏడు గంటలకు మరికొన్ని గ్రామాల్లో 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగడం జరిగింది.

  పోలింగ్ సరళి విశ్లేషిస్తే డబ్బు పంపిణీ నేపధ్యంలో ఒక్కో కుటుంబంలో ని ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులను నరాజు పరుచకుండా తమ ఓట్లు పార్టీల మధ్య పంచేసుకోవడంతో వలస ఓటర్లు, మహిళా, యువత ఓట్లు ఉప ఎన్నికల్లో జయాపజయాలలో కీలక భూమిక గా కనిపిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ ‘నంది’.. తెలంగాణ ‘సింహ’ అవార్డులేమయ్యాయ్!

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page