విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో దూరం ఉంటున్నారని అనుకున్నారో.. ఎన్డీయేతో వైరం ఇంకా మేంటెయిన్ చేస్తున్నారని అనుకున్నారో గానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చంద్రబాబును తమ ఫోల్డర్‌లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఉంది. గతంలో తమతో స్నేహాన్ని నెరిపి.. పొత్తులో పోటీ చేసిన చంద్రబాబు ఇంకా తమతో ఉన్నారని భ్రమలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం శ్రీనగర్‌లో జరిగే బహిరంగ సభకు రావాలని పిలుపు చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. […]

విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో దూరం ఉంటున్నారని అనుకున్నారో.. ఎన్డీయేతో వైరం ఇంకా మేంటెయిన్ చేస్తున్నారని అనుకున్నారో గానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చంద్రబాబును తమ ఫోల్డర్‌లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఉంది. గతంలో తమతో స్నేహాన్ని నెరిపి.. పొత్తులో పోటీ చేసిన చంద్రబాబు ఇంకా తమతో ఉన్నారని భ్రమలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం శ్రీనగర్‌లో జరిగే బహిరంగ సభకు రావాలని పిలుపు చేసింది.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ యాత్ర ఆదివారం శ్రీనగర్లో ముగియగా సోమవారం భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ ముగింపు సభకు రావాలని మొత్తం 21 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖలు రాశారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు కాంగ్రెస్ ఈ ఆహ్వాన లేఖలు పంపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందుకున్న టీడీపీ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు కోరిక. 2014లో ఏపీలో ఈ కూటమే అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2024లో ఈ మూడు పార్టీలు కలసి అధికారం చేజిక్కుంచుకోవాలని చంద్రబాబు తలపోస్తున్నారు. ఇందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు.

వాస్తవానికి2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినది. ఆ తరువాత చంద్రబాబు రాహుల్ గాంధీ, సోనియలతో భేటి అయ్యారు. మోడీకి వ్యతిరేకంగా ప్రత్యేకంగా గ్రూపు కట్టారు. మోదీని దించేదాకా నిద్రపోనని శపథం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేశారు.

సోనియా ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతూ దేశమంతా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మోడీ..బిజెపి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ అటు తెలంగాణలోనూ..ఇటు ఢిల్లీలోనూ అధికారంలోకి రాకపోవడంతో చంద్రబాబు మెల్లగా కాంగ్రెసఖకు దూరం అయ్యారు. 2019లో కేంద్రంలో మోడీ మళ్ళీ ప్రధాని అవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు మార్చి నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి మోదీని ప్రసన్నం చేసుకోవాలని ట్రై చేశారు.

కానీ బీజేపీతో మళ్ళీ పొసగలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబకు లేఖ రాయడం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బిహార్ సీఎం నితీశ్ కుమార్ తమిళనాడు సీఎం స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రులు ఉద్దవ థాక్రే అఖిలేష్ యాదవ్ మాయావతితిలో పాటుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఖర్గే లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కాంగ్రెస్ పక్షాన చేరబోరని, అందుకే ఈ సభకు కూడా వెల్లకపోవచ్చని అంటున్నారు

Updated On 29 Jan 2023 5:13 PM GMT
krs

krs

Next Story