Saturday, January 28, 2023
More
    Homelatestపింఛ‌న్ కోసం వ‌చ్చి స‌జీవ ద‌హ‌నం! ప్ర‌మాద‌మా.. కుట్రా?

    పింఛ‌న్ కోసం వ‌చ్చి స‌జీవ ద‌హ‌నం! ప్ర‌మాద‌మా.. కుట్రా?

    • ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • ఎంపీ, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
    • ప్రమాద స్థలంలోనే డెడ్ బాడీలకు పోస్టుమార్టం

    విధాత, మెదక్ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ళు తప్ప ఆస్తులు లేని కుటుంబం.. బతుకుదెరువు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురం గ్రామంలో మామిడి తోట, ఇతర తోట‌ల‌ను కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అంజమ్మ( 55 ) ఆమె మనమరాలు మధుమ‌తి (6) మంగళవారం అర్ధ‌రాత్రి ఇంట్లో సిలిండర్ పేలి సజీవ దహనమయిన సంఘటన తెలిసిందే. ఈ హృదయ విదారక సంఘటనలో పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

    అంజమ్మ కుటుంబ నేపథ్యం

    చేగుంట మండలం చిన్న శివునూర్ గ్రామానికి చెందిన పిట్టల అంజమ్మ రాజు దంపతులకు ఇందిరమ్మ ఇళ్ళు తప్ప ఆస్తులు లేవు. అంజమ్మ భర్త రాజు మరణించడంతో ఇద్దరు కొడుకులతో సహా యాదాద్రి భువనగిరి జిల్లా రాజీ పేట మండలం వెంకటాపురం గ్రామంలో మామిడి తోటల్లో పనిచేస్తూ కుటుంబం బతుకుతోంది. మృతురాలు అంజమ్మ ఇద్దరు కుమారులు రాజేందర్, రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యులు అందరూ వెంకటాపురం గ్రామంలో తాత్కాలికంగా నివసిస్తున్నారు.

    రేషన్ బియ్యం, పింఛ‌న్ కోసం గ్రామానికి మంగళవారం రాత్రి చిన్నకొడుకు రాజేందర్ కుమార్తె మధుమతితో కలసి అంజమ్మ చేరుకున్న‌ది. వంట చేసుకొని తిని పడుకున్న తరువాత ఇంట్లో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలి ఇద్దరు సజీవ దహనమయ్యారు.

    ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా ఇందులో కుట్ర కోణం ఉందా అని పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన ఇంటికి 3 నెలల క్రితమే కరెంట్ కనెక్షన్ తొలగించారు. అర్ధ‌రాత్రి గ్యాస్ సిలిండర్ పేలుడు ఎలా సంభవించిందన్నది మిస్టరీగా మారింది.

    అంజమ్మ చిన్న కుమారుడు రాజేష్ ఖన్నా,లక్ష్మి దంపతుల కూతురు మధు మతి. మధుమతి నానమ్మతో కలసి వచ్చి ప్రమాదంలో మరణించింది. దీంతో మ‌ధుమ‌తి త‌ల్లిదండ్రుల రోద‌న పలువురిని కంట తడి పెట్టించింది. రామాయంపేట సీఐ శేఖర్ రెడ్డి, ఎస్ఐ ప్రకాష్ గౌడ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    సంఘటన స్థలంలో నే మృతదేహాల‌కు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పోస్టుమార్టం నిర్వహించారు. స్థానిక తహ‌సీల్దార్ లక్ష్మణ్ బాబు, వీఆర్వో నర్సింగ్ యాదవ్, సీఐ, ఎస్ఐ పంచ‌నామా చేశారు.

    ఎంపీ.. ఎమ్మెల్యే ఆర్థిక సాయం

    ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బాధితుల‌ను ప‌రామ‌ర్శించి రూ.50 వేల నగదును బాధిత కుటుంబానికి అంద‌జేశారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు రూ.25 వేల నగదు, బియ్యాన్ని కుటుంబానికి అందించారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular