ఉన్నమాట: గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించడం అంటే ఇదే. ఏనుగులు పోతుంటే కుక్కలు కాలుదువ్వినట్టుంది. స్వరాష్ట్రం కూటిలో రాయి తీయలేనమ్మ పక్క రాష్ట్రంలో పరమాన్నం వండి పెతుందట. సొంతరాష్ట్రంలో, ఉన్న ఊళ్లో, కన్న ఇంట్లో ఉలిపికట్టె, పొరుగూళ్లో పంచాయతీ తీర్పులు చెబుతుందట. హైదరాబాద్ లేకుండా ఆంధ్ర ఏర్పాటు చేస్తారా అని నిలదీసిన అక్కకు ఇప్పుడు మొత్తం తెలంగాణ అప్పనంగా కావాలట. ఆమె తెలంగాణలో పుట్టిందట, తెలంగాణ బిడ్డేనట. మంచినీళ్లు తాగినంత సులువుగా ఒక పెద్ద అబద్ధాన్ని డొలిపేసింది. ఆమె […]

ఉన్నమాట: గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించడం అంటే ఇదే. ఏనుగులు పోతుంటే కుక్కలు కాలుదువ్వినట్టుంది. స్వరాష్ట్రం కూటిలో రాయి తీయలేనమ్మ పక్క రాష్ట్రంలో పరమాన్నం వండి పెతుందట. సొంతరాష్ట్రంలో, ఉన్న ఊళ్లో, కన్న ఇంట్లో ఉలిపికట్టె, పొరుగూళ్లో పంచాయతీ తీర్పులు చెబుతుందట.

హైదరాబాద్ లేకుండా ఆంధ్ర ఏర్పాటు చేస్తారా అని నిలదీసిన అక్కకు ఇప్పుడు మొత్తం తెలంగాణ అప్పనంగా కావాలట. ఆమె తెలంగాణలో పుట్టిందట, తెలంగాణ బిడ్డేనట. మంచినీళ్లు తాగినంత సులువుగా ఒక పెద్ద అబద్ధాన్ని డొలిపేసింది. ఆమె పుట్టింది 1973లో పులివెందులలో. అప్పటికి వాళ్ల నాయన పులివెందులలోనే ఒక ఆసుపత్రి నడుపుతున్నారు. రాజకీయాల్లో పూర్తిగా దిగింది లేదు, హైదరాబాద్ వచ్చింది లేదు.

ఆంధ్ర ఆధిపత్యం వద్దని తన్ని తరిమేసిన చోటనే ఆధిపత్యానికి, అహంకారానికి, అవినీతికి అచ్చుపోసిన రూపం ఊరేగింపులు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరం. విభజన జరిగితే తెలంగాణకు వీసాలు తీసుకోవాల్సి వస్తుందని బెదిరించిన తండ్రి కూతురు ఇప్పుడు ఏ వీసా లేకుండానే తెలంగాణపై దాడి చేస్తోంది. నోటికొచ్చిన అబద్ధాలు, స్థాయికి మించిన మాటలు, వయసుకు మించిన కోతలు తెలంగాణలో వెదజల్లుతూ పోతున్నది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్నవాడు, తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టి సీమ ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడులు, హంద్రీనీవాలను పరుగెత్తించినవాడు, హైదరాబాద్ వనరులను అడ్డంగా దోచుకున్నవాడు వైఎస్. ఆయనను ఓ మహానేతగా భ్రమించి, ఒక బ్రాండుగా ఇష్టపడే అల్పబుద్ధులు, పదవి కోసం ఏ పెంటనయినా తొక్కే పిపీలికాలు, డబ్బులిచ్చి జన సమీకరణ చేయించే కిరాయి కోటిగాళ్లు ఇప్పుడు ఈ మహానేత్రికి జేజేలు కొడుతున్నారు. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద ఆశ్చర్య పోయినట్టుంది వీరి ముచ్చట. - వివేక్‌ R, సిద్దిపేట

Updated On 2 Oct 2022 2:51 AM GMT
krs

krs

Next Story