విధాత‌: కెన‌డా (Canada)లో ఘోరం వెలుగుచూసింది. మైనర్ బాలిక‌ల‌కు సిగ‌రెట్లు, ఆల్క‌హాల్, గంజాయి, డ్రగ్స్ ఇస్తూ వాటికి బ‌దులుగా వారిపై తండ్రీ కుమారులు అత్యాచారాల‌కు పాల్ప‌డ్డారు. గ‌త కొన్ని నెల‌లుగా ప‌లువురు బాలిక‌ల‌పై వారు ఈ నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి భార‌తీయ సంత‌తి కెన‌డియ‌న్లు 24 ఏళ్ల సుమ్రిత్ వాలియా, 56 ఏళ్ల గురుప్ర‌తాప్ సింగ్ వాలియాల‌ను అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఇద్ద‌రినీ ఆల్బెర్టా ప్రావిన్స్‌కు చెందిన కాల్గ‌రీ న‌గ‌ర పౌరులుగా […]

విధాత‌: కెన‌డా (Canada)లో ఘోరం వెలుగుచూసింది. మైనర్ బాలిక‌ల‌కు సిగ‌రెట్లు, ఆల్క‌హాల్, గంజాయి, డ్రగ్స్ ఇస్తూ వాటికి బ‌దులుగా వారిపై తండ్రీ కుమారులు అత్యాచారాల‌కు పాల్ప‌డ్డారు. గ‌త కొన్ని నెల‌లుగా ప‌లువురు బాలిక‌ల‌పై వారు ఈ నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని పోలీసులు తెలిపారు.

దీనికి సంబంధించి భార‌తీయ సంత‌తి కెన‌డియ‌న్లు 24 ఏళ్ల సుమ్రిత్ వాలియా, 56 ఏళ్ల గురుప్ర‌తాప్ సింగ్ వాలియాల‌ను అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఇద్ద‌రినీ ఆల్బెర్టా ప్రావిన్స్‌కు చెందిన కాల్గ‌రీ న‌గ‌ర పౌరులుగా గుర్తించారు.

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ తండ్రీ కొడుకులు ఒక క‌న్వినియెన్స్ స్టోర్‌, ప్రీమియ‌ర్ లిక్క‌ర్ వైన్, స్పిరిట్స్ దుకాణాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ ప‌క్క‌నే ఉన్న ఒక భ‌వ‌నంలో ఈ అత్యాచారాల‌కు ఒడిగ‌ట్టారు. గ‌త డిసెంబ‌రు నుంచి ఈ మే వ‌ర‌కు ఈ నేరం జ‌రిగింద‌ని తెలుస్తోంది. వారి అరెస్టు స‌మ‌యంలో సోదా చేయ‌గా.. 975 గ్రాముల కొకైన్‌, రూ.60 లక్ష‌లు, ఏడు గ‌న్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతే కాకుండా నిందితుల‌ కంప్యూట‌ర్ల‌లో చైల్డ్ పోర్నోగ్ర‌ఫీ, మాద‌క‌ద్ర‌వ్యాలు త‌దిత‌ర స‌మాచారాన్ని క‌నుగొన్నారు. ఇటీవ‌లే ఒక బాలిక మిస్సింగ్ కేసు న‌మోదు కాగా.. తాజాగా ఆ బాలిక‌ను పోలీసులు క‌నుగొన్నారు. త‌న‌ను విచారించ‌గా.. 24 ఏళ్ల వ్యక్తితో బంధంలో ఉన్నాన‌ని తెలిపింది. పోలీసులు తీగ లాగడంతో డొంకంతా క‌దిలి ఈ ఘోరం వెలుగు చూసింది.

Updated On 3 Jun 2023 4:35 PM GMT
somu

somu

Next Story