విధాత, ఢిల్లీ: మద్యం సీసాలపై చట్టపరమైన హెచ్చరికలు ముద్రించాలన్న పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. డ్రగ్స్ మాదిరి మద్యంపైనా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అశ్వనీ ఉపాధ్యాయ కోరారు. మద్యం సీసాలపై హెచ్చరిక లేబుల్ మాత్రమే ఉండాలని, సుప్రీంకోర్టు చిన్నపాటి జోక్యంతో యువతకు మేలు చేస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. మద్య నియంత్రణ అంశం విధానపర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే తిరస్కరిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

విధాత, ఢిల్లీ: మద్యం సీసాలపై చట్టపరమైన హెచ్చరికలు ముద్రించాలన్న పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. డ్రగ్స్ మాదిరి మద్యంపైనా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అశ్వనీ ఉపాధ్యాయ కోరారు.
మద్యం సీసాలపై హెచ్చరిక లేబుల్ మాత్రమే ఉండాలని, సుప్రీంకోర్టు చిన్నపాటి జోక్యంతో యువతకు మేలు చేస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు.
మద్య నియంత్రణ అంశం విధానపర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే తిరస్కరిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
