- జగదేవపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం
- వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదం…
- మృతులు బీబీనగర్‌కు చెందినవారిగా గుర్తింపు..
విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్ మండలం మునిగడప శివారు ప్రాంతంలో ఎల్లమ్మ గుడి క్రాసింగ్ వద్ద Ap29BD 4538 గల కారు అదుపు తప్పి మల్లన్న సాగర్ కాలువలో పడింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సీఐ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ ఐ కృష్ణమూర్తి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్, బొమ్మల రామారానికి చిందిన ఆరుగురు వేములవాడ వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో మునిగడప గ్రామానికి చెందిన స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద పెద్ద మూల మలుపు ఉన్నది. కొడకండ్ల నుంచి జగదేవపూర్ వైపు వెళ్తున్నకారు మూల తిరగగానే అదుపు తప్పి ముందటే ఉన్న కొండపోచమ్మ కాలువ బ్రిడ్జికి ఢీకొని పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది.
కారులో ప్రయాణిస్తున్న 6 గురు వ్యక్తులకు 5 మంది వ్యక్తులు అక్కడికక్కే మృతి చెందారు. మృతి చెందిన వారిలో 1)బోల్లు సమ్మయ్య, 2) బొల్లు స్రవంతి, 3) రాజమణి, 4) భాగ్య శ్రీ, 5) కార్తిక్ ఉండగా 6) వెంకటేష్ ను అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
వీరంతా బీబీనగరర్, బొమ్మలరామరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది స్థానికుల సహకారంతో కాల్వ నుంచి బయటకి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ ఐ కృష్ణమూర్తి తెలిపారు.