విధాత : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో బుధ‌వారం తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మ‌సూరి ఏరియాలోని ఓ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు గొడ‌వ ప‌డ్డారు. రోడ్డుపైనే కొట్టుకుంటుండ‌గా, ఓ కారు విద్యార్థుల పైకి వేగంగా దూసుకొచ్చింది. ఆ వేగానికి ఓ విద్యార్థి గాల్లో ఎగిరిప‌డ్డాడు. కారు నంబ‌ర్ ప్లేట్ కూడా ఊడిపోయింది. కారు దూసుకెళ్లిన అనంత‌రం కూడా ఆ విద్యార్థులు చెప్పుల‌తో కొట్టుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టారు. ఈ […]

విధాత : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో బుధ‌వారం తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మ‌సూరి ఏరియాలోని ఓ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు గొడ‌వ ప‌డ్డారు. రోడ్డుపైనే కొట్టుకుంటుండ‌గా, ఓ కారు విద్యార్థుల పైకి వేగంగా దూసుకొచ్చింది. ఆ వేగానికి ఓ విద్యార్థి గాల్లో ఎగిరిప‌డ్డాడు. కారు నంబ‌ర్ ప్లేట్ కూడా ఊడిపోయింది. కారు దూసుకెళ్లిన అనంత‌రం కూడా ఆ విద్యార్థులు చెప్పుల‌తో కొట్టుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌లువురు విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల పైకి దూసుకొచ్చిన కారును సీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Updated On 22 Sep 2022 1:34 PM GMT
subbareddy

subbareddy

Next Story