WARANGAL | విధాత, వరంగల్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి, తన ద్విచక్ర వాహనానికి తనే నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్ హెడ్ పోస్టాఫీసు సెంటర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ట్రాఫిక్ ఎస్సై రవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. శివ నగర్ ప్రాంతానికి చెందిన పులిశేరు శివ మద్యం మత్తులో తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసి, రోడ్డు దాటుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు […]

WARANGAL |

విధాత, వరంగల్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి, తన ద్విచక్ర వాహనానికి తనే నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్ హెడ్ పోస్టాఫీసు సెంటర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ట్రాఫిక్ ఎస్సై రవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.

శివ నగర్ ప్రాంతానికి చెందిన పులిశేరు శివ మద్యం మత్తులో తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసి, రోడ్డు దాటుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేస్తామనడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యాడు. తన వాహనం పెట్రోల్ పైపును తొలగొంచి శివ నిప్పుపెట్టాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ స్పందించి, మంటలను ఆర్పేసి వాహనాన్ని సీజ్ చేశారు.

అనంతరం వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కి తరలించారు. తన వాహనాన్ని పోలీసులు తీసుకువెళ్ళడంతో మరింత ఆవేశానికి లోనై శివ పోలీసులతో తాను వాహనం నడుపుతూ పట్టుబడలేదని వాగ్వాదానికి దిగాడు. విషయం వైరల్ కావడంతో సదరు యువకున్ని రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లి బైక్‌ని అప్పగించి పంపించారు.

Updated On 3 Sep 2023 10:32 AM GMT
krs

krs

Next Story