విధాత‌: నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అనేది నానుడి. సోషల్ మీడియా లో కొన్ని పోస్టులకు ఇదీ బాగా సూట్ అవుతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది ఏమిటి అన్నది గుర్తించి అందులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడే వారికి, కష్టపడే వారికి సోషల్ మీడియా ఒక ఫ్లాట్ ఫామ్‌గా మారింది అంటే అతిశయోక్తి కాదు. తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి సామాజిక మాధ్యమాల్లో […]

విధాత‌: నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అనేది నానుడి. సోషల్ మీడియా లో కొన్ని పోస్టులకు ఇదీ బాగా సూట్ అవుతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది ఏమిటి అన్నది గుర్తించి అందులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడే వారికి, కష్టపడే వారికి సోషల్ మీడియా ఒక ఫ్లాట్ ఫామ్‌గా మారింది అంటే అతిశయోక్తి కాదు.

తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పెడుతున్న వారిలో సామాన్యుల నుంచి. సెలబ్రిటీల దాకా ఉంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం అంతలా ఉన్నది. ఇక రాజకీయ నాయకులకు, పార్టీలకు అయితే ఇవి పెద్ద ప్రచార వేదికలయ్యాయి.

అయితే సోషల్ మీడియాలో ఎంత పేరు సంపాదించుకుంటారో అదే కొంతమందికి అదే పెద్ద సమస్యగా కూడా మారుతుంది. దీనికి అనేక ఉదాహరణలున్నాయి. సెలబ్రటీలకు కొన్ని పోస్టులు తలనొప్పి తెచ్చి పెడితే.. మరికొందరిని ట్రోల్స్ వెంటాడుతుంటాయి. ఆ మధ్య యాంకర్, నటీ అనసూయ తనపై ట్రోల్స్ చేసిన కొంతమందిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మంచు ఫ్యామిలీ, సీనియర్ నటుడు. నరేష్ అయితే ట్రోల్స్ ఆపండి అని వేడుకున్నారు.

తాజాగా గతేడాది తన పెళ్లి సమయంలో 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. అందాల దునియానే చూపిస్తపా అంటూ ఆ మధ్య ఓ నవవధువు చేసిన డ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆ జంట సాయి శ్రియ, అశోక్ గుర్తుండే ఉంటారు. ఈ పాటతో అతడు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టకుంటున్నది పెండ్లి కుమార్తె. ఆమె డ్యాన్స్ తోనే పెండ్లి కొడుకు నెటీజన్లకు తెలిశాడు. అయితే ఇప్పుడు ఆయన అవినీతి కేసులో పట్టుబడితే ఆమె పేరు ప్రచారంలోకి రావడం గమనార్హం.

సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన సాయి శ్రియ భర్త అశోక్ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌‌లో టౌన్‌ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఏసీబీ మంగళవారం నాడు బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సోదాలు చేయగా రూ. 30 వేలు లంచం తీసుకుంటూ అశోక్ పట్టుబడ్డాడు. దీంతో.. అశోక్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేసింది.

మంచిర్యాల జ‌న్నారాని చెందిన అట‌వీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంప‌తుల పెద్ద కుమార్తె సాయి శ్రియ వివాహం 2021, ఆగస్ట్ 14న రామ‌కృష్ణా పూర్‌కు చెందిన అశోక్‌తో జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక త‌ర్వాత జ‌రిగిన అప్ప‌గింత‌ల స‌మ‌యంలో ‘బుల్లెట్టు బండి’ పాట‌కు న‌వ వ‌ధువు సాయి శ్రియ‌ చేసిన డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

తెలంగాణ యాస‌లో సాగే ‘బుల్లెట్టు బండి’ సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసిన సాయి శ్రియ‌కు అప్పట్లో మంచి ఛాన్స్‌లు కూడా వచ్చాయి. ఇలా.. అప్పట్లో వైరల్ అయిన సాయి శ్రియ వీడియో ఆర్థికంగా కూడా ఈ భార్యాభర్తలకు కలిసొచ్చింది. అలాంటి అశోక్‌ రూ.30 వేల కోసం కక్కుర్తి పడి లంచం తీసుకోవడం గమనార్హం.

అప్పట్లో ఈ జంటకు ఆ వీడియో ఎంత పేరు తీసుకొచ్చిందో తాజాగా వెలుగుచూసిన ఈ లంచం వ్యవహారం అంతకంటే ఎక్కువ అప్రతిష్ట పాలు చేసింది. మీడియాలో అశోక్ లంచం తీసుకున్న వార్తలు రావడంతో కుటుంబ సభ్యులు తలదించుకునే పరిస్థితులొచ్చాయి.

అప్పట్లో పెళ్లి,బరాత్‌, సంగీత్‌, వినాయక మండపాలు ఎక్కడ చూసినా హవా బుల్లుట్లు బండిదే! ‘మనోహరి’, ‘రెడ్డమ్మ తల్లి’, ‘మగువా మగువా’, ‘భలే భలే మగడివోయ్‌’ ‘నాలో మైమరపు’ ‘మహానటి’ వంటి చిత్రాల్లో సూపర్‌హిట్‌ పాటలు పాడిన మోహన భోగరాజు పాడిన పాట ఇది.

లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న సమయంలో వచ్చిన ఐడియాతో సింగర్‌ మోహనా ఈ ప్రయత్నం చేశారు. పెళ్లై అప్పగింతల సందర్భంలో అమ్మాయి ఊహించుకుంటూ పాడుకునే పాట ఇది. లక్ష్మణ్‌ సాహిత్యం, ఎస్‌కె బాజీ సంగీతంలో 2021 ఏప్రిల్‌లో విడుదలైన ఈ పాట చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ స్టెప్పులు వేయించే ఊపు తీసుకొచ్చింది.

అశోక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ఎల్బీనగర్ రాక్‌హిల్స్ కాలనీ అమోగ రెసిడెన్సీ ప్లాట్ నంబర్ 204లో టీపీవో అశోక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6గురు ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.అయితే అపార్ట్మెంట్ ప్రవేట్ సెక్యూరిటీ మీడియాను అనుమతించలేదు.

Updated On 21 Sep 2022 1:25 AM GMT
Somu

Somu

Next Story