Girl Murder | ఓ మహిళ దారుణానికి పాల్పడింది. ఏడేండ్ల బాలికను ఓ వ్యక్తి సహాయంతో కిడ్నాప్ చేసి చంపేసింది. అనంతరం శరీర భాగాలను బకెట్‌లో కుక్కి, గ్రామ సమీపంలో పడేసింది. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని రాంపురా గ్రామానికి చెందిన ఓ ఏడేండ్ల బాలిక సోమవారం తన ఇంటి నుంచి ట్యూషన్‌కు బయల్దేరింది. ట్యూషన్‌కు వెళ్లిన అభిరాజ్ జ్యోత్ కౌర్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆ చిన్నారి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరాలను పరిశీలించారు.
మే 15వ తేదీన బాలికను ఆమె సవతి తల్లి మరో వ్యక్తితో కలిసి కిడ్నాప్ చేశారు. బాలికను బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇక అదే రోజు బాలికను చంపి, శరీర భాగాలను బకెట్‌లో కుక్కి, బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. చిన్నారిని చంపింది సవతి తల్లే అని పోలీసులు నిర్ధారించారు. సవతి తల్లితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
#UPDATE: The 7-year-old girl who was abducted yesterday from Rampura village in #Amritsar, was killed by her step mother and was also seen in the CCTV footage taking the girl child body carried away in a bucket. https://t.co/3D2vvLdSpe pic.twitter.com/qzcYOFr6DC
— Nikhil Choudhary (@NikhilCh_) May 17, 2023