న్యూ ఢిల్లీ,విధాత‌ : దేశంలో పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం తీసుకువస్తానని, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీనికి కొత్త జవసత్వాలు చేకూర్చే ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందాలకు, అబ్బురపరిచే పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. దగ్గరలోని అందాల్ని వదిలేసి చాలామంది ఎన్నో వ్యయప్రయాసలతో విదేశాలకు వెళ్తున్నారు. కారణం.. సరైన ప్రచారం.. మౌలిక […]

న్యూ ఢిల్లీ,విధాత‌ : దేశంలో పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం తీసుకువస్తానని, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీనికి కొత్త జవసత్వాలు చేకూర్చే ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందాలకు, అబ్బురపరిచే పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. దగ్గరలోని అందాల్ని వదిలేసి చాలామంది ఎన్నో వ్యయప్రయాసలతో విదేశాలకు వెళ్తున్నారు. కారణం.. సరైన ప్రచారం.. మౌలిక సదుపాయాలు లేకపోవడమే. ఈ ధోరణి మారాలి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో ఈ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతా’ అని చెప్పారు. పర్యాటక రంగానికి జవసత్వాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులను చేస్తుందని స్పష్టంచేశారు. నరేంద్రమోదీ సర్కారులో కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి వస్తుందని ఊహించలేదని, మూడు శాఖలు ఇచ్చి పెద్ద బాధ్యత మోపారు. వాటిని ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థంగా నిర్వహిస్తానని, తెలుగువారు గర్వపడేలా పనిచేస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే, రాష్ట్రంలో భాజపా బలోపేతం కోసం గట్టి కృషి చేస్తానని స్పష్టంచేశారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి మీడియాతో కొన్ని విష‌యాలు చెప్పారు.
ప్రధాని మోదీ కేబినెట్‌లో పదోన్నతి వస్తుందని అనుకోలేదు. ఏకంగా మూడు శాఖలు.. అవీ ప్రధానమైనవి అప్పగించడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ఈశాన్య రాష్ట్రాలకు రూ. 68,000 కోట్ల భారీ బడ్జెట్‌ ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో సమానంగా అక్కడ అభివృద్ధి జరిగేలా చూడాలి. కేంద్రం తమను నిర్లక్ష్యం చేయట్లేదని, తమ అభివృద్ధిని కాంక్షిస్తుందన్న నమ్మకం వారిలో కల్పించడం.. తుపాకులతో హింసకు పాల్పడేవారిని ఆ మార్గానికి దూరం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసిందన్నారు.అలాగే అమిత్‌షా దగ్గర పనిచేయడం మంచి అనుభవం. నాకు అప్పగించిన బాధ్యతలను కష్టపడి నిర్వర్తించా. నాపై నమ్మకంతో హోంశాఖకు సంబంధించిన కీలక అంశాలను అప్పగించారు. ఆ శాఖలో మరింతకాలం పనిచేయాలని మనసులో ఉండేది. అనుకోకుండా పదోన్నతి వచ్చింది. 3 శాఖలు రావడం.. వ్యక్తిగతంగా సవాలే. ఆ శాఖల పరిధిలోని ఐదుగురు సహాయమంత్రుల సహకారంతో సమర్థంగా పనిచేసి ప్రధాని దగ్గర, ప్రజల్లో పేరు తెచ్చుకుంటాన్నారు.

Updated On 10 July 2021 5:59 AM GMT
subbareddy

subbareddy

Next Story