కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోనే పునర్నిర్మాణం పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 17 ఏండ్లుగా పడావుగా పనులు వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయుల శిల్ప కళా నైపుణ్యానికి చిహ్నంగా చారిత్రక సంపదగా గుర్తింపు పొందిన వెయ్యి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆదివారం దాస్యం […]

  • కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోనే పునర్నిర్మాణం
  • పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • 17 ఏండ్లుగా పడావుగా పనులు
  • వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయుల శిల్ప కళా నైపుణ్యానికి చిహ్నంగా చారిత్రక సంపదగా గుర్తింపు పొందిన వెయ్యి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆదివారం దాస్యం వినయ్ భాస్కర్ గుడిని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. వివాదాల కోసం ఆలయాల గురించి మాట్లాడే బీజేపీ ప్రభుత్వానికి ఈ ప్రాచీన ఆలయం మాత్రం పట్టడంలేదన్నారు.

17 ఏండ్లుగా పనులు జాప్యం

రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం ముందుకు సాగడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపుతో 17 ఏండ్లుగా వెయ్యి స్తంభాల గుడి పునరుద్ధరణ పనులు ఒక్క ఇంచు ముందుకు పడలేదని విమర్శించారు.

పునర్నిర్మాణం కోసం గుడిని విప్పి పెట్టిన శిలలు, శిల్పాలు ఎక్కడెక్కడో పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.. వెయ్యేండ్ల క్రితం నాటి ఈ గొప్ప నిర్మాణం ఇప్పుడు దయనీంగా మారిందన్నారు. వెయ్యి స్తంభాల గుడి పర్యవేక్షణ కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోనే ఉన్నదని గుర్తుచేశారు.

వెయ్యి స్తంభాల ఆలయం, మండం పునరుద్ధరణ కోసం 2006లో రూ.3.50 కోట్లను మంజూరు చేసిందని, 2009లోపు ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా 2010 ఫిబ్రవరి 3న పనులు మొదలయ్యాయి. చారిత్రక ఆలయాల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా తమిళనాడుకు చెందిన స్తపతి బృందం కళ్యాణ మండపం లోని రాతి నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగించారు

అప్పటికే 132 పిల్లర్లను, 160 బీములు విరిగిపోయి ఉండడంతో వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. దీనికి అనుగుణంగా కొత్తగా శిలలను, వాటిపై శిల్పాలను చెక్కారని వివరించారు.

నిధుల విడుదలలో నిర్లక్ష్యం

వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణాని అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో స్తపతి పనులను వదిలేసి వెళ్లిపోయారని వినయ్ అన్నారు. దీంతో చారిత్రక వెయ్యి స్తంభాల మంటపం పునర్నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిసెంబరు నెల వరకు కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి వరంగల్ ప్రజలకు అంకితం చేస్తామని ప్రగల్భాలు పలికిండని, డిసెంబరు నెలపోయి మూడు నెలలు అయినా మంత్రి ఇంకెప్పుడూ చేస్తారని అడుగుతున్నామని వినయ్ అన్నారు. కుడా చైర్మన్ సుందర్‌రాజు,అధికారులు పాల్గొన్నారు.

Updated On 19 March 2023 1:51 PM GMT
krs

krs

Next Story