Tuesday, January 31, 2023
More
  Homelatestనల్లగొండ BRSలో కలకలం.. తెలంగాణ ఉద్యమకారులతో ‘చకిలం’ ఆత్మీయ సమ్మేళనం

  నల్లగొండ BRSలో కలకలం.. తెలంగాణ ఉద్యమకారులతో ‘చకిలం’ ఆత్మీయ సమ్మేళనం

  విధాత: జిల్లా కేంద్రం నలగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలిచిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్‌చార్జి, బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు చకిలం అనిల్ కుమార్ మరోసారి ఆ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలక భూమికకు సిద్ధమయ్యారు.

  రేపు బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించే సమావేశానికి ఉద్యమకారులను, పార్టీ కార్యకర్తలను ఆహ్వానించారు. బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాకనైనా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు ప్రభుత్వంలో తగిన గౌరవం, పదవులు దక్కుతాయన్న ఆశలు అడియాశలవుతుండటంపై ఉద్యమకారుల్లో తీవ్ర అసహనం రగులుతోంది.

  పటేల్ వర్సెస్ దామన్న.. మంత్రిని ఢీ కొట్టే తీరు ఇదేనా..!

  ముఖ్యంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ ఉద్యమంలో అనేక వ్యయ ప్రయాసలు భరించి పని చేసిన ఉద్యమకారులకు సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నుంచి చిన్న చూపు ఎదురవుతుందన్న అసంతృప్తితో ఉన్న వారందరినీ చకిలం నేటి ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించడం బీఆర్ఎస్ నియోజకవర్గ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.

  కనీసం తమను ప్రభుత్వ పథకాల్లో, అభివృద్ధి పనుల కేటాయింపుల్లో సైతం పరిగణలోకి తీసుకోవడం లేదంటూ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఆవేద‌న చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చకిలం వారందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చేందుకు రేపు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుండటం బీఆర్ఎస్ రాజకీయాల్లో చర్చినీయాంశమైంది.

  సార్.. రూట్ మార్చారు: కోమటిరెడ్డి అనుచరుల్లో మళ్లీ డైలమా!

  అదీగాక ఇటీవల ఖమ్మం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసంతృప్తి వాదులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. అయితే నల్గొండ చకిలం అనిల్ కుమార్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ ఉద్యమకారుల పేరిట నిర్వహిస్తుండడం ఆసక్తి రేపుతోంది.

  తాను పార్టీ ఇన్‌చార్జిగా పనిచేసిన నలగొండ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో చకిలం అనిల్ పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన చకిలం ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు.

  ఆగని ‘పిల్లి’ గర్జన..! కళ్లెం వేసేందుకు కంచర్ల పట్టు!

  2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని గట్టిగా ప్రశ్నించి రెబల్‌గా రంగంలోకి దిగేందుకు చకిలం ఓ దశలో సిద్ధ పడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఓడించాలంటే చకిలం అనిల్ సహా టికెట్ ఆశించిన చాడ కిషన్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మద్దతు అనివార్యమని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారందరినీ బుజ్జగించి అసమ్మతిని సద్దుమణిగేలా చేసి కంచర్ల విజయానికి అంతా కలిసి పనిచేసేలా ఒప్పించారు.

  ఈ సందర్భంగా చకిలం అనిల్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించుకొని ప్రత్యేకంగా సమావేశమై పార్టీ టికెట్ విషయమై అన్యాయం జరిగినప్పటికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి కట్ట బెడతానంటూ హామీ ఇచ్చారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నమ్మిన చకిలం గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపు కోసం తనవంతు ప్రచారం సాగించారు.

  నకిరేకల్‌లో ముదురుతున్న చిరుమర్తి, వేముల టికెట్ పంచాయితీ!

   

  బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ చకిలం అనిల్ కుమార్‌కు ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవి విషయాన్ని సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారు. దీంతో పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా తనకు తగిన పదవి, గుర్తింపు ఇవ్వకపోవడం, కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవినైనా ఇవ్వకపోవడంపై చకిలం అనిల్ కుమార్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

  సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో ఇంతకాలం ఓపిక పట్టిన చకిలం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా టర్మ్ సైతం పూర్తి కావస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానంపై తన పదవి విషయమై ఒత్తిడి పెంచేందుకు తన కార్యకలాపాల్లో దూకుడు పెంచేందుకు సిద్ధ పడ్డారు. కనీసం త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లోనైనా తనకు అవకాశం కల్పించాలని, లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ టికెట్‌ను కేటాయించాలని చకిలం అనిల్ కుమార్ కోరుకుంటున్నారు.

  నల్గొండ: BRSలో పోస్టర్ల రచ్చ.. కంచర్లపై చాడ వర్గం ఫైర్!

  ఈ నేపథ్యంలో చకిలం రేపు నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నియోజక వర్గం బీఆర్ఎస్ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు పోటీగా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ ఆయన అనుచరుడు పిల్లి రామరాజు, గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, చాడ కిషన్ రెడ్డిలు నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో హడావుడి చేస్తు టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి, ఎమ్మెల్యే కంచర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

  ఇదే సమయంలో గోరుచుట్టుపై రోకలిపోటు అన్న చందానా చకిలం అనిల్ కుమార్ సైతం తిరిగి యాక్టివ్‌ అయి మళ్లీ అనుచరులను సమీకరించుకుంటూ ‘తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం’తో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని అసంతృప్తులను, అశావాహులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమావేశంపైనే సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోను టికెట్‌ విషయంలో ఈ సారి ఉపేక్షించేది లేదని, ఉద్యమకారుల్లో ఎవరికో ఒకరికి టికెట్‌ ఇవ్వాల్సిందే అనే పట్టుదలతో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.

  NALGONDA: గులాబీ కోటలో కమల వికాసం సాధ్యమేనా..?

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular