విధాత‌: ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ పార్టీలు మారుతున్న నేత‌ల‌ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్ట్రా పైకి పాకుతున్న ఊస‌ర‌వెల్లి వీడియోను షేర్ చేశారు. ఆ స్ట్రాకు ఉన్న రంగులకు అనుగుణంగా ఊస‌ర‌వెల్లి త‌న రంగును మారుస్తున్న‌ట్లు దృశ్యాలు క‌నిపించాయి. రాజ‌కీయ ఫిరాయింపుదారుల‌కు ఊస‌ర‌వెల్లి రోల్ మోడ‌ల్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ […]

విధాత‌: ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ పార్టీలు మారుతున్న నేత‌ల‌ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ వీడియోను విడుద‌ల చేశారు.

ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్ట్రా పైకి పాకుతున్న ఊస‌ర‌వెల్లి వీడియోను షేర్ చేశారు. ఆ స్ట్రాకు ఉన్న రంగులకు అనుగుణంగా ఊస‌ర‌వెల్లి త‌న రంగును మారుస్తున్న‌ట్లు దృశ్యాలు క‌నిపించాయి. రాజ‌కీయ ఫిరాయింపుదారుల‌కు ఊస‌ర‌వెల్లి రోల్ మోడ‌ల్ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ ప‌డిన శ‌శిథ‌రూర్.. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే చేతిలో ఓట‌మి పాల‌య్యారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో శ‌శిథ‌రూర్ పేరు లేదు. దీంతో శ‌శిథ‌రూర్ మ‌న‌స్తాపానికి గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. గ‌త ఎన్నిక‌ల్లోనూ స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో శ‌శిథ‌రూర్ పేరు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Updated On 19 Nov 2022 9:06 AM GMT
krs

krs

Next Story