విధాత‌: దాదాపు ఐదేళ్ల తరువాత, అంటే 2018లో ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి బీజేపీని నోటికొచ్చినట్లు తిట్టినా చంద్రబాబు తాజాగా హోం మంత్రి అమిత్ షా (Chandrababu Meets Amit Shah)ను కలిశారు.. కలిసారు అంటే కలిశారు .. లోపల ఏమి మాట్లాడుకున్నారు.. ఎం చర్చకు వచ్చింది.. ఇవేమీ బయటకు రావడం లేదు. ఒకవేళ లోపల ఏమైనా పాజిటివ్ గా మాట్లాడి ఉంటె ఈపాటికి టీడీపీ, దాని మద్దతుదారులైన మీడియా సంస్థలు ఈపాటికి ఊదరగొట్టేవి. కానీ […]

విధాత‌: దాదాపు ఐదేళ్ల తరువాత, అంటే 2018లో ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి బీజేపీని నోటికొచ్చినట్లు తిట్టినా చంద్రబాబు తాజాగా హోం మంత్రి అమిత్ షా (Chandrababu Meets Amit Shah)ను కలిశారు.. కలిసారు అంటే కలిశారు .. లోపల ఏమి మాట్లాడుకున్నారు.. ఎం చర్చకు వచ్చింది.. ఇవేమీ బయటకు రావడం లేదు. ఒకవేళ లోపల ఏమైనా పాజిటివ్ గా మాట్లాడి ఉంటె ఈపాటికి టీడీపీ, దాని మద్దతుదారులైన మీడియా సంస్థలు ఈపాటికి ఊదరగొట్టేవి.

కానీ ఢిల్లీ పర్యటన తరువాత అటు నుంచి పెద్దగా సౌండ్ రాలేదు.. అంటే లోపల ఏమీ పెద్దగా పాజిటివ్ లేదా.? అసలు ఎందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినట్లు..? వీటిమీద చాలా చర్చలు.. నిరూపణ, ఆధారాల్లేని అభిప్రాయాలూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

మార్గదర్శి కేసులో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామోజీరావు ఇప్పుడు తన కోడలు, మార్గదర్శి ఎండి శైలజను ఆంధ్ర సీఐడీ అరెస్ట్ చేస్తుందేమో అని భయపడుతున్నారట అందుకే ఆమెను అరెస్ట్ చేయకుండా తప్పించడానికి ఢిల్లీ పెద్దల నుంచి జగన్ మీద ఒత్తిడి తెచ్చెదుకు రామోజీరావే చంద్రబాబును ఢిల్లీ పురమాయించారని అంటున్నారు.

ఇంకా ఆంధ్రాలో బిజెపి, టీడీపీ పొత్తుల గురించి చర్చకు వచ్చినా అవేం పెద్దగా ఆశా జనకంగా లేవని అంటున్నారు. ఆంధ్రాలో ఏమాత్రం బలం లేని బిజెపి చాలా సీట్లు అడుగుతోందట.. అన్ని సీట్లు బిజెపికి ఇచ్చేస్తే ఇబ్బంది అని చంద్రబాబు భావిస్తున్నారు అని ఒక సమాచారం.

అసలు పొత్తుల గురించి చర్చ రానేలేదని కూడా అంటున్నారు. మొత్తానికి ఢిల్లీ టూర్లో చంద్రబాబు పెద్దగా వెనిఫిట్ ఐంది ఏమీ లేదని, అక్కడ ఏమాత్రం సానుకూలంగా ఉన్నా తన మీడియా ద్వారా ఈపాటికే దేశం మొత్తం ఊదరగొట్టేవారని ఒక వర్గం అంటోంది. ఆంధ్ర బీజేపీలో రెండు వర్గాలున్నాయి.

ఒకవర్గం బీజేపీ, టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతుండగా ఇంకోవర్గం మాత్రం అసలు టీడీపీతో కలిసి వెళ్తేనే తమకు నష్టం అని, తమ క్యాడర్ మొత్తం డ్యామేజీ అయిపోతోందని అంటున్నది. మొత్తానికి ఢిల్లీ పర్యటన లో చంద్రబాబు ఏమి సాధించారన్నది ఇప్పటికీ తెలియడం లేదు.

Updated On 6 Jun 2023 8:06 AM GMT
Somu

Somu

Next Story