విధాత‌: విపత్తులోనూ.. ప్రమాదంలోనూ.. ఇబ్బందుల్లోనూ అవకాశాలు వెతుక్కుని తన లక్ష్య సాధనకోసం ముందుకు సాగడం సమర్థుడి లక్షణం అంటారు. కానీ, చావుల్లోనూ అవకాశాలు వెతకడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కనిపిస్తున్నాయి. కందుకూరులో తన సమావేశంలో తొక్కిసలాట జరిగి ఎనిముది మంది మరణించిన ఘటనకు సంబంధించి చంద్రబాబు స్పందించిన తీరు, ఆ తరువాత ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే చిత్రంగానే ఉంది. ఆ సభలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేశారు. మృతుల పిల్లలను […]

విధాత‌: విపత్తులోనూ.. ప్రమాదంలోనూ.. ఇబ్బందుల్లోనూ అవకాశాలు వెతుక్కుని తన లక్ష్య సాధనకోసం ముందుకు సాగడం సమర్థుడి లక్షణం అంటారు. కానీ, చావుల్లోనూ అవకాశాలు వెతకడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కనిపిస్తున్నాయి.

కందుకూరులో తన సమావేశంలో తొక్కిసలాట జరిగి ఎనిముది మంది మరణించిన ఘటనకు సంబంధించి చంద్రబాబు స్పందించిన తీరు, ఆ తరువాత ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే చిత్రంగానే ఉంది. ఆ సభలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేశారు.

మృతుల పిల్లలను ఎన్టీయార్ ట్రస్ట్ స్కూల్లో వేసి చదివించడం వంటి హామీల వరకూ ఆమోదమే కానీ ఆ మృతుల వివరాలు చెబుతూ చంద్రబాబు కాసింత గొప్పలు చెప్పుకున్నట్లు సమాజం భావిస్తోంది. మొత్తం ఎనిమిదిమంది మరణించగా అందులో నలుగురు ఎస్టీలు.. ఇంకో నలుగురు ఎస్సిలు.. అందులో ఓ ఓసి. అంటూ చంద్రబాబు చావుల్లోనూ లెక్కలు వివరించారు.

అంటే తనకు ఏయేవర్గాల నుంచి మద్దతు ఉంది.. ఎవరెవరు ఉత్సాహంగా సభకు వచ్చారు. ఏయే వర్గాలు మద్దతుగా ఉన్నాయన్నది చంద్రబాబు చెప్పదలిచారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆనాడు గోదావరి పుష్కారాల్లోనూ దాదాపు పాతికమంది పైనే మరణించారు.

మరి ఆనాడు ఇలా ఏయే కులాల్లోని వాళ్ళు ఎంతమంది మరణించారని లెక్కలు ఎందుకు చెప్పలేదూ అంటే అప్పట్లో ఎన్నికలు దగ్గర్లో లేవు కాబట్టి.. ఎన్నికల్లో తనకు ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే చంద్రబాబు ఎలాంటి నిర్ణయానికి.. ఎలాంటి మాటలకైనా వెనుకాడరు అనేది ఇక్కడ స్పష్టమయింది.

ఈ కామెంట్స్‌పై వైసీపీ సోషల్ మీడియా చాలా గట్టిగా ఎదురుదాడి చేస్తోంది. కేవలం చంద్రబాబుకు మైలేజీ వస్తోందని చెప్పుకోవడానికి ఇలాంటి సభలు పెడుతున్నారని, తన లబ్ధి కోసం ప్రాణాలు బలిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అది నరబలి అని, నారాబలి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఏది ఏమైనా గానీ మృతుల కులాలు లెక్కలు బయటికి తీసి చెప్పడం చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడికి తగని పని కాద‌ని అంటున్నారు.

Updated On 31 Dec 2022 3:13 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story