Chandramukhi 2 | స్టైల్‌గా రాజసం ఉట్టిపడేట్టుగా నడిచి వస్తున్న రజనీకాంత్.. వయ్యారాలు ఒలకబోస్తూ నాట్యం చేస్తున్న జ్యోతిక.. వీళ్లు ఇద్దరూ ఆ సినిమా పేరు తలుచుకోగానే గుర్తుకు వచ్చేస్తారు. హుందాతనం కన్నా చింపిరి జుట్టుతో, చెదిరిన కాటుకతో ఆమె చేసే నాట్యం, నటన, చెప్పే అర్థంకాని గంభీరమైన తమిళ డైలాగులు ఇవి మాత్రమే చంద్రముఖి సినిమాకు ఆ పాత్రకు ప్రాణం పోశాయి. ఇక కొత్తగా ఎందరు చంద్రముఖి పాత్ర పోషించినా ఎందుకో జ్యోతిక నప్పినట్టుగా మరొకరు […]

Chandramukhi 2 |

స్టైల్‌గా రాజసం ఉట్టిపడేట్టుగా నడిచి వస్తున్న రజనీకాంత్.. వయ్యారాలు ఒలకబోస్తూ నాట్యం చేస్తున్న జ్యోతిక.. వీళ్లు ఇద్దరూ ఆ సినిమా పేరు తలుచుకోగానే గుర్తుకు వచ్చేస్తారు. హుందాతనం కన్నా చింపిరి జుట్టుతో, చెదిరిన కాటుకతో ఆమె చేసే నాట్యం, నటన, చెప్పే అర్థంకాని గంభీరమైన తమిళ డైలాగులు ఇవి మాత్రమే చంద్రముఖి సినిమాకు ఆ పాత్రకు ప్రాణం పోశాయి. ఇక కొత్తగా ఎందరు చంద్రముఖి పాత్ర పోషించినా ఎందుకో జ్యోతిక నప్పినట్టుగా మరొకరు సూట్ కాలేదు.

గతంలో శోభనా, సౌందర్యలతో పాటు విద్యాబాలన్, అనుష్క ఇలా చాలామందే ఈ పాత్రను పోషించి అబ్బే జ్యోతికలా చేయలేకపోయారనే అనిపించుకున్నారు. వీళ్ళలో సౌందర్య, శోభనా కాస్త పరవాలేదనిపించినా.. మిగతావారు అంతగా నప్పలేదు. ఇక చంద్రముఖి సినిమా సీక్వెల్‌గా ఆమధ్య వచ్చిన నాగవల్లిలో కూడా కమలినీ ముఖర్జీ, అనుష్క కూడా చంద్రముఖి పాత్రను ధరించి మెప్పించ లేకపోయారు.

తాజాగా ఈ సినిమాకు ‘చంద్రముఖి పార్ట్ 2’ అంటూ పి. వాసు మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ పాత్రకు రాఘవ లారెన్స్, చంద్రముఖి పాత్రకు కంగనా రనౌత్‌ని తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు.. అయితే కంగనా ఈ పాత్రకు సరిగా సరిపోతుందా అనేది సర్వత్రా ఉత్కంఠగానే ఉంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి తెలిసిన విషయం ఏంటంటే.. చంద్రముఖి2 కి ముందుగా సాయిపల్లవిని అనుకున్నారట.

అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆమె ఇందులో నటించేందుకు ముందుకు రాలేదు. కాకపోతే సాయిపల్లవి నటన, ఆమె పాత్రలో లీనమై పలికించే హావభావాలు, డాన్స్ లాంటి మెళకువలన్నీ చంద్రముఖి పాత్రకు సరిగ్గా సరిపోయేవని మేకర్స్ అభిప్రాయపడ్డారు. ఆమె కనుక చంద్రముఖి పాత్ర చేసి ఉంటే ఆ పాత్ర మరికొన్నాళ్ళు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయేదని ఇటు అభిమానులు అభిప్రాయపడ్డారు.

అయితే సాయిపల్లవి మరో అవకాశాన్ని కూడా చేయిజార్చుకుంది. ఈమధ్య కాలంలో విడుదలైన భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రను మొదట సాయిపల్లవి చేయాలని అనుకోగా.. అది రీమేక్ సినిమా కావడంతో ఆమె అందులో నటించేందుకు ఒప్పుకోలేదట. తర్వాత ఈ అవకాశం కీర్తీ సురేష్‌కు దక్కింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటనపరంగా చిరంజీవి, కీర్తి సురేష్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే చంద్రముఖి పాత్రకు కంగనా రనౌత్ తనే చేస్తానని ముందుకు వచ్చినట్టుగా మొన్నామధ్య ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. చంద్రముఖి 2 ట్రైలర్‌లో కూడా కంగనా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated On 13 Sep 2023 3:40 AM GMT
krs

krs

Next Story