Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా తన పని పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై చీకటి అలుము కోనుండడంతో రోవర్‌ను స్లీప్‌మోడ్‌లోకి పంపనున్నట్లు పేర్కొంది. రోవర్‌ను సురక్షితంగా పార్క్ చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చెప్పింది. రోవర్‌కు ఇచ్చిన అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ తన అసైన్‌మెంట్‌ను […]

Chandrayaan-3 |
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా తన పని పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై చీకటి అలుము కోనుండడంతో రోవర్‌ను స్లీప్‌మోడ్‌లోకి పంపనున్నట్లు పేర్కొంది. రోవర్‌ను సురక్షితంగా పార్క్ చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చెప్పింది. రోవర్‌కు ఇచ్చిన అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లుగా ప్రకటించింది.
ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసింది. ఇప్పుడుదాన్ని పార్క్ చేసి స్లీప్ మోడ్‌లో సురక్షితంగా సెట్ చేశాం. పేలోడ్‌లు APXS, LIBS రెండూ టర్న్ ఆఫ్ చేశాం. వాటి నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి ట్రాన్స్‌మీట్ అయ్యింది. రోవర్ బ్యాటరీ ప్రస్తుతం ఫుల్ ఛార్జి అయి ఉంది. రోవర్ సోలార్ ప్లేట్స్‌కు తర్వాత సూర్యుడి కాంతిపడేలా సెట్ చేసి ఉంచాం.
ఈ నెల 22న మళ్లీ దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అవుతుందని, ఆ సమయంలో మళ్లీ రోవర్ సోలార్ ప్యానెల్స్‌పై పడుతుంది. రిసీవర్‌ను ఆన్‌లోనే పెట్టాం. సూర్యోదయానికి రోవర్ మళ్లీ నిద్రలేస్తుందని భావిస్తున్నాం’ అంటూ ఇస్రో పేర్కొంది.
అయితే, చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ సరిగానే పని చేస్తున్నాయని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. రోవర్ ల్యాండర్‌కు వంద మీటర్ల దూరం వరకు వెళ్లి పరిశోధనలు చేపట్టిందని వివరించారు. అయితే, 14 రోజుల పాటు కాలంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. చంద్రుడి ఈక్వేటర్ వద్ద చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది.
అయితే, ఈ స్థాయిలో చలిని తట్టుకొని ప్రజ్ఞాన్ రోవర్ మనగడ కొనసాగిస్తుందా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఆశలతో నింగిలోకి చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన ల్యాండర్.. తన పని పూర్తి చేసింది. అయితే, మళ్లీ సూర్యోదాయానికి ల్యాండర్, రోవర్ నిద్రావస్త విజయవంతంగా మేలుకొని.. మరింత పరిశోధనలు చేయాలని ఇస్రోతో పాటు దేశ ప్రజలు సైతం ఆశిస్తున్నారు.
