ఎన్నికల తేదీ దగ్గరపడటంతో ధార్మిక అంశాల చుట్టే తిరుగుతున్న రాజకీయం బజరంగ్‌దళ్‌పై నిషేధం, కేరళ స్టోరీ అంశాలను ప్రస్తావిస్తున్నప్రధాని, బీజేపీ నేతలు ప్రజాసమస్యలు, పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డిజిల్‌, గ్యాస్‌, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడలంటున్న రాహుల్‌, ప్రియాంక ఆసక్తికరంగా చివరి అంకం ప్రచారం విధాత‌: కర్ణాటక ఎన్నికల (Karnataka Election 2023) తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల అజెండా మారిపోయింది. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల తర్వాత ఎన్నికల ప్రచారం తీరు మారిపోయింది. […]

  • ఎన్నికల తేదీ దగ్గరపడటంతో ధార్మిక అంశాల చుట్టే తిరుగుతున్న రాజకీయం
  • బజరంగ్‌దళ్‌పై నిషేధం, కేరళ స్టోరీ అంశాలను ప్రస్తావిస్తున్నప్రధాని, బీజేపీ నేతలు
  • ప్రజాసమస్యలు, పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డిజిల్‌, గ్యాస్‌, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడలంటున్న రాహుల్‌, ప్రియాంక
  • ఆసక్తికరంగా చివరి అంకం ప్రచారం

విధాత‌: కర్ణాటక ఎన్నికల (Karnataka Election 2023) తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల అజెండా మారిపోయింది. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల తర్వాత ఎన్నికల ప్రచారం తీరు మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో ధార్మిక అంశాలు కాకపుట్టిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకత, అధికారపార్టీ అవినీతి ఆరోపణలు, సీనియర్ల నేతలైన జగదీశ్‌ శెట్లర్‌, లక్ష్మణ్‌ సవదిలకు బీజేపీ టికెట్లు నిరాకరించడంతో వాళ్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అప్పటివరకు ఢీలా పడినట్లు కనిపించిన కమలనాథులు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో తర్వాత దూకుడు పెంచారు. ప్రచార వ్యూహాన్ని మార్చి కాంగ్రెస్‌ లక్ష్యంగా ఎదురుదాడికి దిగింది.

కర్ణాటకలో తిరిగి అధికారం దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ అవినీతి అంశాలను ప్రస్తావిస్తూ.. ఉచిత హామీలను ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే మత కలహాలకు కారణమయ్యే వ్యక్తులు, లేదా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), బజరంగ్‌దళ్‌ వంటి సంస్థలపై నిషేధం విధించనున్నట్లు వాగ్దానం చేసింది.

బజరంగ్‌ దళ్‌ నిషేధ అంశాన్నే ఎన్నికల అస్త్రంగా చేసుకుని ప్రధాని మోడీ సహా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు కాంగ్రెస్‌ పార్టీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ప్రధాని అయితే కొన్నిరోజులుగా తన ప్రసంగానికి ముందు, చివర్లో జై బజరంగ్‌బలి అని నినదిస్తుస్తూ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు లబ్ధి పొందడానికి యత్నిస్తున్నారు.

ప్రధాని ప్రచారానికి కొనసాగింపుగా బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ లాంటి సంస్థలు కూడా కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను వ్యతిరేకిస్తూ.. హనుమాన్‌ చాలీసాను పఠిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. ఇవే కాకుండా ప్రధాని ఉగ్రకుట్రల కథాంశంతో నిర్మించిన కేరళ స్టోరీని ప్రస్తావిస్తూ..కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదానికి రక్షణగా నిలుస్తున్నదని ధ్వజమెత్తుతున్నారు.

మరోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ప్రధాని మోడీ ప్రజాసమస్యల గురించి మాట్లాడటం లేదని ప్రశ్నిన్నారు. ఈ మూడున్నరేళ్ల డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమిటి చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆకాశాన్నంటిని నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డిజిల్‌, గ్యాస్‌ ధరల మంటలు, నిరుద్యోగ సమస్యలపై కమలం పార్టీనేతలు స్పందించాలంటున్నారు.

కాగా.. ప్రచార గడువుకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. బీజేపీ మతం, భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్ల లబ్ధి పొందాలని యత్నిన్నది. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్‌ ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. కర్ణాటకలో ప్రధాని వంగి ఓటర్లకు నమస్కారం చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీ నేతల ప్రచారంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌, రీల్స్‌తో సెటైర్లు పేలుతున్నాయి.

Updated On 6 May 2023 6:16 AM GMT
Somu

Somu

Next Story