Cheetah And Tortoise | ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. అందులోనూ నిత్యం ఘర్షణ పడే వన్యజీవుల మధ్య అప్పుడప్పుడు అవ్యాజమైన ప్రేమ వెల్లివిరుస్తున్న దృశ్యాలు అబ్బురపరుస్తుంటాయి. వాటి జాతులు వేరైనా స్నేహంతో మెలగడం ముచ్చటగొల్పుతుంది. అటువంటిదే ఈ సన్నివేశం కూడా. చీతాలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల జీవులు. తాబేలు అందుకు పూర్తి భిన్నం. ప్రమాదం ఎదురైందంటేనే తన తలను కాళ్లను లోపలికి ముడుచుకునే తాబేలు.. ఓ చిరుత మందు ధైర్యంగా నిలబడింది. దాని ధైర్యమే […]

Cheetah And Tortoise |
ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. అందులోనూ నిత్యం ఘర్షణ పడే వన్యజీవుల మధ్య అప్పుడప్పుడు అవ్యాజమైన ప్రేమ వెల్లివిరుస్తున్న దృశ్యాలు అబ్బురపరుస్తుంటాయి. వాటి జాతులు వేరైనా స్నేహంతో మెలగడం ముచ్చటగొల్పుతుంది. అటువంటిదే ఈ సన్నివేశం కూడా.
చీతాలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల జీవులు. తాబేలు అందుకు పూర్తి భిన్నం. ప్రమాదం ఎదురైందంటేనే తన తలను కాళ్లను లోపలికి ముడుచుకునే తాబేలు.. ఓ చిరుత మందు ధైర్యంగా నిలబడింది. దాని ధైర్యమే గొప్ప అనుకుంటే.. మెల్లగా చొరబడి తన ఆహారాన్ని లాగించేస్తున్న తాబేలును చిరుత ఏమీ అనని తీరు చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఇది కదా ప్రకృతి అంటే అంటూ చప్పట్లు కొడుతూ దండాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. చీతా తన గిన్నెలోని ఆహారాన్ని తింటుంటే.. చడీ చప్పుడు లేకుండా వచ్చిన తాబేలు.. చిరుతతో కలిసి.. ఆ ఆహారాన్ని పంచుకున్నది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి అనేక ప్రశంసలు కురిశాయి.
ఇలా ఎలా జరిగిందబ్బా.. అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తే.. రెండు పరస్పర భిన్న జీవులు ఒకే చోట సామరస్యంతో జీవించడంపై మరికొందరు ఆసక్తికర కామెంట్లు చేశారు. మనం కూడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా జీవిస్తే ఎంతో బాగు కదూ! అని కొందరు రాశారు. ఇది ప్రకృతి గొప్పతనమని కొందరు వ్యాఖ్యానించారు.
Cheetah & tortoise share food. Those who give their food give their heart.
📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ
— Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023
