Wednesday, December 7, 2022
More
  HomeBreakingనా గురించి మాట్లాడితే చెప్పుతో కొడ‌తా: ఎమ్మెల్సీ క‌విత‌

  నా గురించి మాట్లాడితే చెప్పుతో కొడ‌తా: ఎమ్మెల్సీ క‌విత‌

  విధాత: ఎంపీ అరవింద్ అత్యంత హేయమైన భాషతో వ్యాఖ్యలు చేస్తున్నారని, నా గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాపై అభాండాలు వేయాలని ఎంపీ అరవింద్‌ చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆయన ఒక బురద లాంటి వ్యక్తి అని  ఆయన మీద రాయి వేస్తే మన మీదనే పడుతదని అన్నారు. ఆయన తన భాషను మార్చుకోకపోతే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని హెచ్చరించారు.

  నేను ఇంత మాట అన్నా అంటే అరవింద్ ఎంత చీప్ అనేది ఆలోచించాలని అన్నారు. నేను కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నా అని కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట.. మరి అరవింద్ ఎందుకు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారో చెప్పాలని అన్నారు. మల్లికార్జున్ ఖర్గేతో అందరికీ ఫ్రెండ్ షిప్ ఉంటదని అందరు మాట్లాడుతరని అన్నారు.

  మీ నాన్న కేసీఆరే చెప్పాడు: ఎంపీ అర‌వింద్‌

  అర‌వింద్‌ తన చిల్లర మాటలతో నిజామాబాద్ పేరును చెడ గొడుతున్నారని, ఈసారి ఎన్నికల్లో వెంటపడి  ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని సవాల్‌ చేశారు. పార్లమెంట్‌లో ఎంపీలు యావరేజ్‌గా 20 డిబేట్లలో పాల్గొంటే అరవింద్ ఎంపీగా 4 ఏళ్లలో కేవలం 5 చర్చల్లో పాల్గొని  56 ప్రశ్నలకు మాత్రమే పరిమితం అయ్యార‌ని మండిప‌డ్డారు. ఏ ఒక్క అంశం పై గొంతెత్తి మాట్లాడలేదని అన్నారు. పార్లమెంట్లో టీఆర్ఎస్‌ ఎంపీలతో పోల్చితే కనీసం సగం పర్ఫామెన్స్ కూడా లేదని ధ్వజమెత్తారు.

  పసుపు బోర్డ్ తెస్తామని బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేశారన్నారు. రేపటి నుంచి పోలీస్ స్టేషనలలో రైతులు చీటింగ్ కేసులు పెట్టబోతున్నారని, ఆయన ఫేక్ సర్టిఫికెట్స్ తో ఎన్నికల్లో పోటీ చేశారని క్వాలిఫికేషన్ పైన పార్లమెంట్‌లో ఫిర్యాదు చేస్తా అని అన్నారు.

  రాజకీయాల్లో ఉంటే నీతి, నిజాయితీ ఉండాలని రాజకీయాలు చేయాలి గానీ దిగజారవద్దని సూచించారు. నేను పార్టీ మారుతానని ప్రచారం చేస్తే గట్టిగా బుద్ధి చెబుతాన‌న్నారు. నేను కాల్‌ చేశాననే ఆరోపణపై ఖర్గేను అడగండని అన్నారు. నా బతుకు, పుట్టుక తెలంగాణ.. తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం లేదన్నారు. నేను రాజకీయాలలోకి వచ్చినప్ప‌టి నుంచి వ్యక్తిగతంగా ఎప్పుడూ మాట్లాడలేదని గుర్తు చేశారు.

  ఇలా మాట్లాడుతున్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తున్నానని కవిత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేను బాధతో మాట్లాడుతున్నానని, నాకు చాలా ఆశలు చూపించారని, షిండే తరహాలో నాకు ఆఫర్స్ వస్తే ఆ ప్రతిపాదనలను నేను తిరస్కరించానన్నారు. ఈడీ కేసులు అని బెదిరింపులు కూడా వచ్చాయని, కానీ నాకు అధికారికంగా ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.

  లిక్కర్ స్కాం పై మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని.. ఎలాంటి కేసులులైనా ఎదురుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు బీజేపీ ప్రతిపక్ష నేతలపై 25వేల కేసులు పెట్టిందని కానీ ఒక్క కేసును కూడా  నిరూపించలేదన్నారు. ఇంకోసారి నేను అరవింద్ పై  మాట్లాడనని, ప్రెస్మీట్ కూడాపెట్టనని స్పష్టం చేశారు.

  ఎంపీ అర‌వింద్ ఇంటిపై దాడి.. ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం

  ఎంపీ కవిత కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడరని వారితో టచ్‌లో ఉన్నారని నిన్న ఎంపీ ఆరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ శ్రేణలు ఫైర్‌ అయ్యాయి. శుక్రవారం బంజారాహిల్స్‌ 12లోని ఆయన ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునేందుకు యత్నిచారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page