- వసతుల ఏర్పాటుపై సన్నాహక సమావేశం
- తరలిరానున్న లక్షలాది భక్తులు
విధాత: నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం శ్రీ చెరువు గట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుండి వచ్చె నెల ఫిబ్రవరి 2 వ తేదీ వరకు ఆరు రోజులు పాటు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సన్నాహక సమీక్ష సమావేశం గురువారం నిర్వహించగా జడ్పి చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వ శాఖలు సమకూర్చాలన్నారు. ఇందుకు ప్రణాళికబద్ధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, జడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నార్కెట్పల్లి ఎంపిపి సూదిరెడ్డి నరెందర్ రెడ్డి, ఎంపీటీసీ మేకల రాజి రెడ్డి , సర్పంచ్ మాల్గ బాలకృష్ణ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కొండూరు శంకర్, ఈవో నవీన్ తదితరులు పాల్గొన్నారు