Raksha Bandhan | విధాత: రక్షా బంధన్ అనగానే.. అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం గుర్తుకు వస్తోంది. ఈ పేగుబంధం కలకాలం నిలవాలని కోరుకుంటూ.. అన్నదమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతారు. అయితే ఓ సోదరి మాత్రం తన సోదరుడికి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని బహుమతిని ఇచ్చింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన సోదరుడికి కిడ్నీ దానం చేసి.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది. ఇదే కదా నిజమైన రక్షా బంధన్ అంటే. […]

Raksha Bandhan | విధాత: రక్షా బంధన్ అనగానే.. అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం గుర్తుకు వస్తోంది. ఈ పేగుబంధం కలకాలం నిలవాలని కోరుకుంటూ.. అన్నదమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతారు. అయితే ఓ సోదరి మాత్రం తన సోదరుడికి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని బహుమతిని ఇచ్చింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన సోదరుడికి కిడ్నీ దానం చేసి.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది. ఇదే కదా నిజమైన రక్షా బంధన్ అంటే.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఓం ప్రకాశ్ ధంగర్(48) గతేడాది మే నెల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఒక కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం మేర దెబ్బతిన్నాయి. దీంతో అతని కుటుంబ సభ్యులు ఓం ప్రకాశ్‌కు కిడ్నీ శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు. అయితే, కిడ్నీ దాత కావాలని వైద్యులు చెప్పడంతో.. రాయ్‌పూర్ లోని తిక్రపారాలో నివాసం ఉండే ఓం ప్రకాశ్ సోదరి షీలాబాయి పాల్ వెంటనే కిడ్నీ దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఈ రాఖీ పండుగకు తన సోదరుడికి కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో షీలాబాయికి డాక్టర్లు అవసరమైన అన్ని టెస్టులు చేయగా.. ఆమె కిడ్నీ సోదరుడికి మ్యాచ్ అవుతుందని వెల్లడైంది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన గుజరాత్‌లోని ఓ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడికి వారం ముందు షీలాబాయి తన సోదరుడు ఓం ప్రకాష్‌కు రాఖీ కట్టింది. తన సోదరుడు ఆయురారోగ్యాలతో జీవించాలనే కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపింది. రాఖీకి ఇంతకంటే మంచి బహుమతి ఏమి ఇవ్వగలను అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
