Chicken Rates | తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలకు పైనే న‌మోదు అవుతున్నాయి. దీంతో కోళ్ల ఫామ్‌లో కోళ్లు విల‌విలలాడిపోతున్నాయి. ఎండ‌ల వేడిమిని భ‌రించ‌లేక కోళ్లు చ‌నిపోతున్నాయి. కోళ్ల ఉత్ప‌త్తి కూడా భారీగా పడిపోయింది. దీంతో డిమాండ్‌కు త‌గ్గ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో.. చికెన్ ధ‌ర‌లు కొండెక్కి కూర్చున్నాయి. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే కిలో మీద రూ. 50 వ‌ర‌కు పెరిగింది. ప్ర‌స్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధ‌ర […]

Chicken Rates | తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలకు పైనే న‌మోదు అవుతున్నాయి. దీంతో కోళ్ల ఫామ్‌లో కోళ్లు విల‌విలలాడిపోతున్నాయి. ఎండ‌ల వేడిమిని భ‌రించ‌లేక కోళ్లు చ‌నిపోతున్నాయి. కోళ్ల ఉత్ప‌త్తి కూడా భారీగా పడిపోయింది. దీంతో డిమాండ్‌కు త‌గ్గ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో.. చికెన్ ధ‌ర‌లు కొండెక్కి కూర్చున్నాయి.

వారం రోజుల వ్య‌వ‌ధిలోనే కిలో మీద రూ. 50 వ‌ర‌కు పెరిగింది. ప్ర‌స్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధ‌ర రూ. 260 దాకా ప‌లుకుతోంది. స్కిన్‌తో కూడిన చికెన్ రూ. 230 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఈ ధ‌ర‌లు మ‌రో వారం రోజుల పాటు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని కోళ్ల వ్యాపారులు చెబుతున్నారు.

వేసవి సీజన్ కావడం, వేడుకలు, పెళ్లిల్లు అధికమవడంతో చికెన్ వినియోగం పెరిగింది. దీంతో ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. వారం రోజుల త‌ర్వాత చికెన్ ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

Updated On 16 May 2023 1:53 AM GMT
subbareddy

subbareddy

Next Story