DK Shivakumar |
కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచుకునేందుకు ముఖ్యమంత్రి పదవి పూర్వీకుల ఆస్తి కాదు అని ఆయన పేర్కొన్నారు. సీఎం పోస్టుకు సిద్ధరామయ్య, శివకుమార్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సిద్ధరామయ్యకే సీఎం పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు లీకులు చేస్తున్న నేపథ్యంలో శివకుమార్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ ఓ ఇంగ్లీష్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్యకు సీఎం పోస్టు కట్టబెడితే మీరు అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు డీకే ఈ విధంగా బదులిచ్చారు. ముఖ్యమంత్రి పోస్టు అనేది ఆస్తి కాదు. ఏదో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తోబుట్టువులు పంచుకున్నట్టు.. దీన్ని పంచుకోలేము అని పేర్కొన్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో పీసీసీగా పదవీ బాధ్యతలు స్వీకరించి, పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. ఆ కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. ఈ అఖండ విజయం నేపథ్యంలో తాను ఎలాంటి రివార్డులు ఆశించడం లేదని స్పష్టం చేశారు.
సిద్ధరామయ్యతో పాటు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నకు డీకే శివకుమార్ ఈ విధంగా బదులిచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. తన మద్దతుదారులు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉండే కాబట్టి ఢిల్లీకి వెళ్లలేకపోయానని తెలిపారు.
ಕೆಪಿಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷರಾದ @DKShivakumar ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬವನ್ನು ಭಾನುವಾರ ಮಧ್ಯರಾತ್ರಿ ಕೇಕ್ ಕತ್ತರಿಸುವ ಮೂಲಕ ಆಚರಿಸಲಾಯಿತು. ಮಾಜಿ ಸಿಎಂ @siddaramaiah ಅವರು ಕೇಕ್ ತಿನ್ನಿಸಿ ಶುಭಾಶಯ ತಿಳಿಸಿದರು. ಎಐಸಿಸಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾದ @rssurjewala, ಕಾರ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ @SaleemAhmadINC, ಮಾಜಿ ಸಚಿವರಾದ @dineshgrao,… pic.twitter.com/kgiMOjfG5q
— Karnataka Congress (@INCKarnataka) May 14, 2023