- కలకం సృష్టిస్తున్న నిధుల కేటాయింపు..
- కోవిడ్.. ఎవరి దగ్గర సమాచారం ఉన్నా వెల్లడించాలని కోరిన WHO
- చైనా అమెరికా మధ్య మాటల యుద్ధం
- పరోక్షంగా రష్యాను సమర్థిస్తున్న చైనా
- చైనానే నిందిస్తున్న నాటో దేశాలు
- తటస్థ వైఖరిని అవలంబిస్తున్న భారత్
China has increased its defense budget
విధాత: సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం దేశ రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను 225 బిలియన్ డాలర్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం పెంచింది. విదేశీ ముప్పును ఎదుర్కోవడానికి డ్రాగన్ దేశం రక్షణ నిధులను భారీగా పెంచింది.
కరోనా వైరస్ (Covid-19) చైనా ప్రయోగశాల (Chinese lab leak) నుంచే ఆవిర్భవించిందని మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కొవిడ్ మూలాల గురించి ఏ దేశం వద్ద సమాచారం ఉంటే దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సైన్స్ సంస్థలకు వెల్లడించాలని, ఇది అత్యావశ్యం అని పేర్కొన్నది.
కరోనా మూలం గుర్తింపులో ఏ అవకాశాన్ని వదిలేయం: WHO
ఇది సేకరించడానికి ఏ ఒక్కరినో నిందించడానికి కాదని, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే సమాచారాన్ని కోరుతున్నామన్నది. కరోనా మూలాన్ని గుర్తించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలేయమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెట్రోస్ (WHO Director-General Dr Tedros) చెప్పారు.
చైనా వైపే వేలెత్తి చూపుతున్న నాటో దేశాలు
కొవిడ్ విషయంలో అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. నాటో దేశాలు కూడా ఈ విషయంలో చైనా వైపే వేలెత్తి చూపుతున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తుండగా.. చైనా పరోక్షంగా రష్యాను సమర్థిస్తుండటం అగ్రరాజ్యానికి మింగుడు పడటం లేదు. వీటన్నింటి నేపథ్యంలో చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచడం కలకలం సృష్టిస్తున్నది.