Coronavirus | చైనాలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విలయతాండ‌వం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్ర‌తి రోజు మిలియ‌న్ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. బీఎఫ్.7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టంతో పిట్ట‌ల్లా జ‌నాలు రాలిపోతున్నారు. బెడ్ల కొర‌త తీవ్రంగా ఏర్ప‌డింది. ఆస్ప‌త్రుల్లో చేరేందుకు గంట‌ల కొద్ది వేచి ఉండాల్సి వ‌స్తోంది. అంతే కాదు శ‌వాల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు కూడా ఫ్రిజర్లు స‌రిపోవ‌డం లేదు. దీంతో ప్ర‌తి రోజు శ‌వాల‌ను ఖ‌న‌నం చేస్తున్నారు. […]

Coronavirus | చైనాలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విలయతాండ‌వం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్ర‌తి రోజు మిలియ‌న్ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. బీఎఫ్.7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టంతో పిట్ట‌ల్లా జ‌నాలు రాలిపోతున్నారు. బెడ్ల కొర‌త తీవ్రంగా ఏర్ప‌డింది. ఆస్ప‌త్రుల్లో చేరేందుకు గంట‌ల కొద్ది వేచి ఉండాల్సి వ‌స్తోంది. అంతే కాదు శ‌వాల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు కూడా ఫ్రిజర్లు స‌రిపోవ‌డం లేదు. దీంతో ప్ర‌తి రోజు శ‌వాల‌ను ఖ‌న‌నం చేస్తున్నారు.

చైనాలో నిన్న ఒక్క‌రోజే ఒక మిలియ‌న్ పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు, 5 వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు లండ‌న్‌కు చెందిన ఓ రీసెర్చ్ సంస్థ వెల్ల‌డించింది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తోంది. 1.4 బిలియ‌న్ల జ‌నాభా ఉన్న చైనాలో జ‌న‌వ‌రి నాటికి డైలీ కేసుల సంఖ్య 3.7 మిలియ‌న్ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. మార్చి నాటికి 4.2 మిలియ‌న్లకు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని, అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

అయితే క‌రోనా అప్డేట్‌పై చైనా నిజాల‌ను దాచిపెడుతుంద‌ని ప‌లు దేశాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు విష‌యంలో దొంగ లెక్క‌లు చెబుతుంద‌ని మండి ప‌డుతున్నాయి. ఇంకా చైనా వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్ర‌క్రియ పూర్తి కాలేదు. ల‌క్ష‌లాది మంది వ్యాక్సిన్ వేసుకోలేద‌ని రికార్డులు చెబుతున్నాయి. కొవిడ్ కేసుల ఉధృతికి ఇది కూడా ఒక కార‌ణం కావొచ్చ‌ని నిపుణులు భావిస్తున్నారు.

Updated On 23 Dec 2022 7:36 AM GMT
subbareddy

subbareddy

Next Story