Tuesday, January 31, 2023
More
  Homelatestబిగ్‌బాస్ రన్నర్ శ్రీహాన్‌‌పై చిన్మ‌యి ఆగ్రహం

  బిగ్‌బాస్ రన్నర్ శ్రీహాన్‌‌పై చిన్మ‌యి ఆగ్రహం

  విధాత‌: బిగ్‌బాస్ రన్నర్ శ్రీహాన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఆకతాయిగా చేసిన పని సింగర్ చిన్మయికి కోపం కలిగేలా చేసింది. చిన్నపిల్లలతో అలా ప్రవర్తించి వారిని తప్పుదోవ పట్టించవద్దని అర్థం వచ్చేలా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె రెబల్.. క్యాస్టింగ్ కౌచ్ పై మొదటగా గళం విప్పిన వారిలో ఆమె ఒకరు.

  మీటూతో మొద‌లైన క్యాస్టింగ్ కౌచ్‌‌కి సంబంధించిన వ్యతిరేక ఉద్య‌మాన్ని ఈమె నడిపిస్తోంది. ఏకంగా సీనియర్ రైటర్ వైరముత్తుతో అలుపెరుగని పోరాటం చేస్తోంది. వైరముత్తు పలువురిని లైంగిక వేధింపులకు గురి చేశాడనేది ఆమె ఆరోపణ. తన విషయంలోనే కాదు దేశంలో ఏ చిన్న విషయం, అనుచిత ఘటన జరిగినా ఈమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది.

  ఇక విషయానికొస్తే చిన్మ‌యి మాట్లాడుతూ కొన్ని చర్యలు పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఒక చెడు ధోరణి వైపు నడిపిస్తాయి. మన సమాజంలో తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే చనిపోతామని బెదిరిస్తారు. చదువు, పెళ్లి వంటి వ్యవహారాల్లో చెప్పిన మాట వినకపోతే ఏదో ఒకటి చేసుకుంటామని భయ పెడతారు. ఈ దురాచారానికి చరమగీతం పాడాలి. అది జరగాలంటే బాల్యం నుండే బ్లాక్ మెయిలింగ్ కరెక్ట్ కాదని చెప్పాలి అని అభిప్రాయ పడింది.

  ఆమెను ఇంతలా హర్ట్ చేసిన విషయం ఏమిటంటే.. శ్రీహాన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ఆమెను చాలా బాధించిందట. ఆమెను హార్ట్ చేసిన ఆ వీడియోలో ఏముందో పరిశీలిస్తే సిరి వద్ద ఒక కుర్రాడు పెరుగుతున్నాడు. ఆ పిల్లాడు సిరి మేనల్లుడు అని సమాచారం. చిన్నప్పటి నుంచి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెను మమ్మీ అని పిలుస్తాడు. సిరి లవర్ శ్రీహాన్‌ని డాడీ అని పిలుస్తాడు. కాగా బాలుడు శ్రీహాన్ చెప్పిన మాట వినలేదట. మరోసారి అలా చేయకుండా భయపెట్టాలి అనుకున్నాడు శ్రీ‌హాన్‌. దానికోసం బెల్టు తీసుకొని తనకు తాను బెల్టుతో కొట్టుకుంటూ పిల్లాడికి భయం చెప్తున్నాడు.

  శ్రీహాన్ సెల్ఫ్ హ‌ర్ట్‌ చేసుకుంటుంటే పిల్లాడు ఏడుస్తున్నాడు. శ్రీహాన్ చర్య పిల్లాడి మనసుపై ప్ర‌తికూల ప్రభావం చూపుతుంది. ఒక చెడు ధోర‌ణి వైపు నడిపిస్తుందని చిన్మయి అంటుంది. శ్రీహాన్ చర్య దానిని పిల్లల్లో ప్రోత్సహించేదిగా ఉందని ఆమె అభిప్రాయం. ఇక బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీ‌హాన్ ర‌న్న‌ర్‌గా నిలిచాడు. దానికి గాను 45 లక్షలు గెలుచుకున్నాడు. ఇటీవల లవర్ బర్త్‌డే సందర్భంగా ఆమెకు ఒక రింగు కొన్నాడు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకుంటారని ప్రచారం జరుగుతుంది. చాలా కాలంగా శ్రీహన్, సిరి రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.

   

  View this post on Instagram

   

  A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular