విధాత‌: దాస‌రి త‌ర్వాత సినీ కార్మికులంద‌రు గౌర‌వించే వ్య‌క్తి, సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. దాస‌రి త‌ర్వాత ఈయ‌న‌నే అంద‌రు గురువు గారు అని పిలుస్తారు. తానేం అనుకుంటాడో అదే ముక్కుసూటిగా ఓపెన్‌గా చెప్పేస్తారు. ఇక విష‌యానికి వ‌స్తే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా, నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. థియేటర్లలో వీర సింహారెడ్డి గర్జన చేస్తే.. వాల్తేరు వీరయ్య పూన‌కాలు తెప్పించింది. వీర‌సింహారెడ్డి ప‌క్కా మాస్ […]

విధాత‌: దాస‌రి త‌ర్వాత సినీ కార్మికులంద‌రు గౌర‌వించే వ్య‌క్తి, సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. దాస‌రి త‌ర్వాత ఈయ‌న‌నే అంద‌రు గురువు గారు అని పిలుస్తారు. తానేం అనుకుంటాడో అదే ముక్కుసూటిగా ఓపెన్‌గా చెప్పేస్తారు. ఇక విష‌యానికి వ‌స్తే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా, నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.

థియేటర్లలో వీర సింహారెడ్డి గర్జన చేస్తే.. వాల్తేరు వీరయ్య పూన‌కాలు తెప్పించింది. వీర‌సింహారెడ్డి ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఓరియంటెడ్ చిత్రం. ఇక వాల్తేరు వీర‌య్యది కూడా అదే జోన‌ర్. అయితే చిరు ఎంట‌ర్టైన్‌ మెంట్, వింటేజ్ చిరు లుక్కులు ఈ చిత్రానికి ప్ల‌స్ అయ్యాయి.

ఈ చిత్రాన్ని కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లు కోరుకునే ప్రేక్షకులే ఆదరిస్తారని మొదట అంతా భావించారు. రివ్యూలు కూడా వాటికి అనుగుణంగానే వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ చూసి ఆనందిస్తున్నారు.

వీరసింహారెడ్డి చిత్రాన్ని బీసీ సెంటర్లలో మాస్ ఆడియన్స్ బాగా లైక్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాలపై కొందరు నెగటివ్‌గా మాట్లాడారు. ముఖ్యంగా చిరంజీవి గురించి.. అసలు ఆయన ఈ సినిమాలో ఏం చేశాడని, సినిమాలో క‌థ‌ లేదని నెగటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారికి తమ్మారెడ్డి ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ఇచ్చారు.

చిరంజీవి, బాలకృష్ణ ఎవ‌రి స్టామినా వారిది. ఈ వయసులో చిరంజీవి అలా చేయడం కష్టం. ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమాతో వస్తే ఆల్ ఇండియాలో 1000 కోట్లు కలెక్ట్ చేయగల సత్తా చిరంజీవి ఉంది. సరైన సినిమా పడితే రికార్డులు కొల్లగొడతారని అన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు మంచి రెవెన్యూ తెచ్చాయని, ఇది పరిశ్రమకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు విడుదలైన మొదటి రెండు రోజులు మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు జరిగాయి. కానీ రెండు సినిమాలు హిట్ కావడంతో వారు త‌మ హీరోల విజయాలను చూసి ఆ ఖుషీలో ఉండిపోయారు. ఒకవేళ ఒక సినిమా హిట్ అయి మరో సినిమా ఫ్లాప్ అయితే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది.

Updated On 25 Jan 2023 12:45 PM GMT
krs

krs

Next Story