Tuesday, January 31, 2023
More
  Homelatestచిరంజీవిది నిర్వేదమా.. వైరాగ్యమా?.. కామెంట్స్‌పై అభిమానుల ఆవేదన!

  చిరంజీవిది నిర్వేదమా.. వైరాగ్యమా?.. కామెంట్స్‌పై అభిమానుల ఆవేదన!

  విధాత‌: మెగాస్టార్ చిరంజీవి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారు. రాజకీయాలకు తాను దూరం అయ్యాను గానీ రాజకీయాలు తనకు దూరం కాలేదని అంటారు.. అవసరం అయితే మళ్ళీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తానని అంటారు. ఫ్యాన్స్ సంబరపడే లోపు తాను రాజకీయాల గురించి మాట్లాడేది లేదంటారు.

  తన దృష్టి అంతా సినిమాల మీదనే అంటారు.. జగన్, మోడీ ఇద్దరి నుంచి తనకు రాజకీయంగా ఆఫర్లు ఉన్నాయని పుకార్లు నిత్యం వస్తూనే ఉంటాయి. మరోవైపు తమ్ముడు పవన్‌కు మద్దతుగా ఉంటానని ఓసారి.. అచ్చచ్చ.. అదేం లేదని ఇంకోసారి చెబుతూ జనాన్ని.. అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మొన్నటికి మొన్న అయితే ఇంకా ఘోరమైన కామెంట్స్ చేసి అభిమానుల గుండెల్లో పొడి చేశాడు చిరంజీవి.

  ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ ఏపీ పక్క రాష్ట్రం. ఆ రాష్ట్రం రాజకీయాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదు. ఇది మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. అంతే కాదు తాను ఓటు హక్కు కలిగి ఉన్న రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నా తనకు ఏపీ రాజకీయాల మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఆసక్తి అంతకంటే లేదు అన్నారు.

  అయితే ఆ ఫ్లోలో చిరంజీవి ఏపీని తాను పుట్టిన రాష్ట్రాని పక్క రాష్ట్రం అంటూ అభిమానులు ప్రజల గుండెల్లో పొడి చేశారని అంటున్నారు. నిజానికి చిరంజీవికి ఏపీ అంటే విపరీతమైన మక్కువ. ఆయన విశాఖలో ఒక ఇల్లు కట్టుకుని రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తానని తాజాగా చెప్పారు.

  మరి ఆ మాట అలా జనం నోళ్లలో ఉండగానే ఇపుడు ఇలా ఏపీ పొరుగు రాష్ట్రం నాకేంటి సంబంధం అన్నట్లుగా మాట్లాడడం మీద ఫ్యాన్స్ సహా సగటు జనాలు హర్ట్ అవుతున్నారు. అంత పొరుగు రాష్ట్రం అయితే సినిమాల కలెక్షన్లకు మాత్రం పనికి వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.

  ఇక తనకు రాజకీయాలు అంటే అసలు ఇష్టం లేదని, తాను వాటి గురించి పట్టించుకోనని, తన ఇంటికి పేపర్లు కూడా రావని చిరంజీవి చెప్పడం పట్ల కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. చిరంజీవిలో ఈ వైరాగ్యానికి.. నిర్వేదానికి కారణం ఏమిటా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular