విధాత: మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ప్రజారాజ్యం పెట్టి ఉండవచ్చు. కేంద్ర మంత్రిగా పనిచేసి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగియగానే ఆయన మౌనంగా రాజకీయాలను వీడి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మరలా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
నాటి నుంచి నేటి వరకు ఆయన రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించింది లేదు. వాటి గురించి పెద్దగా విశ్లేషించింది.. మాట్లాడింది కూడా ఏమీ లేదనే చెప్పాలి. అలా రాజకీయంగా మౌనం వహించి రాజకీయ సన్యాసం తీసుకుని ఎంతో హుందాగా సినీ పరిశ్రమలో పెద్దగా ఉన్న చిరంజీవిని ఉద్దేశించి రోజా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతుంది. దాంతో ఇప్పటికే జనాలలో బోలెడు నెగటివిటీని మూటగట్టుకుంది.
ఇటీవల మెగా ఫ్యామిలీలోని ముగ్గురు అన్నదమ్ములకు ఎలాంటి ఎమోషన్స్ లేవు. ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. వారి వలన ప్రజలకు ఒరిగేందేమీ లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో నెటిజన్లు రోజాపై ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. గతంలో చిరు ఏకంగా కేంద్ర పర్యాటక మంత్రిగా చేశాడు.
ఇప్పుడు రోజా కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే పర్యాటక మంత్రి. రాజకీయంగానే కాదు.. సినిమాల పరంగా కూడా చిరుకి ఏమాత్రం సరితూగదు. ఇలా చూసుకుంటే చిరంజీవి గ్రాఫ్ ముందు రోజా దేనికి పనికిరాదు. ఈమె నోరు చెత్తకుప్పతో సమానమని నాగబాబు దీటైన సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా డైమండ్ రాణి అని ఆమెను పోల్చుతూ సెటైర్లు వేశాడు.
మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.. : Minister Roja
Full Video>>>https://t.co/ALlEnQMmbv#MinisterRoja #YCP #CMJagan #PawanKalyan #Janasena #HyperAadi #NTVNews #NTVTelugu pic.twitter.com/vWUnSTRXBZ
— NTV Telugu (@NtvTeluguLive) January 17, 2023
తాజా మెగా ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటూ అజాతశత్రువుగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి మీద కూడా ఆమె అవాక్కులు చవాకులు పేల్చడం మెగా ఫ్యాన్స్ కు చిర్రెత్తేలా చేస్తోంది.
ఆమె మాటలపై ఇటీవల చిరు వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో మెగా పంచులను విసిరాడు. అలా ఆయన ఆమె తన తప్పును తెలుసుకుని తర్వాత రోజా నుంచి బహుశా క్షమాపణలు ఊహించి ఉంటారు. కానీ ఆమె మరలా తన నోటికి పని చెప్పింది.
సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ చెప్పినట్టే వినాలి. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే సినిమాల్లో అవకాశాలు రావు. వాళ్ల మీద భయంతోనే కొంతమంది అలా మాట్లాడుతారు అంటూ హైపర్ ఆదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.
అయినా ఆ కుటుంబం వల్ల ఏమీ కాదు. వాళ్ళకి అంత సీను ఉండి ఉంటే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజుని ఎందుకు గెలిపించుకో లేకపోయారు. సినిమాలలో క్రేజ్ ఉంది కదా అని ఓట్లు వేయరు. అలా వేసే పనే అయితే గతంలో ఒకాయన సీఎం అయ్యేవాడు అంటూ చిరంజీవిని ఇన్ డైరెక్ట్‌గా కార్నర్ చేసింది. ఈ విధంగా రోజా మరోసారి నోరు జారడంతో దీనికి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి..!