విధాత‌: మెగాస్టార్ చిరంజీవి ఎంతో కాలం తర్వాత చేసిన పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ అయినప్పటికీ ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ముసలి వారి నుండి చిన్నవారి వరకు అందర్నీ విపరీతంగా అలరిస్తోంది. చిత్రం నుంచి ట్రైలర్, టీజర్, సాంగ్స్ వంటివి అన్నీ విడుదలకు ముందే పెద్ద సంచలనం సృష్టించాయి. ఇక ఈ చిత్రం థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాల కంటే మరో […]

విధాత‌: మెగాస్టార్ చిరంజీవి ఎంతో కాలం తర్వాత చేసిన పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ అయినప్పటికీ ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ముసలి వారి నుండి చిన్నవారి వరకు అందర్నీ విపరీతంగా అలరిస్తోంది.

చిత్రం నుంచి ట్రైలర్, టీజర్, సాంగ్స్ వంటివి అన్నీ విడుదలకు ముందే పెద్ద సంచలనం సృష్టించాయి. ఇక ఈ చిత్రం థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాల కంటే మరో రేంజిలో ఉండడంతో జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ వ‌సూళ్లు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 200 కోట్లను వసూలు చేయడం ఖాయం అంటున్నారు. టీజర్ ట్రైలర్ పాటలకు వచ్చిన అంచనాలను మించి ఈ చిత్రం ఉండడం విశేషం. దాంతో ఈ చిత్రాన్ని చూస్తున్నవారు పూనకాలకు లోన‌వుతున్నారు.

సాధారణంగా ఒక చిత్రం ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయితే వెంటనే ఆ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్టు కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుందనేది వారి ఆలోచన.

నేడు పాన్ ఇండియా రేంజిలో కూడా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌కుండా కేవలం తెలుగులో మాత్రమే తీశారు. పాన్ ఇండియాగా తీయలేదు. సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా మూవీగా ఆకట్టుకోలేకపోవడంతో వాల్తేరు వీరయ్య కేవలం తెలుగు ప్రేక్ష‌కుల కోసం తెలుగు నేటివిటీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచి, తన నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో వాటిని అందిస్తూ ఈ చిత్రాన్ని చిరు చేశారు.

తాజాగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ లో కూడా భారీ పోటీ నడుస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సల్మాన్ ఖాన్ ఈ చిత్రం నాకైతే బాగుంటుంది నా బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది అని భావించారట. దాంతో చిరంజీవికి ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది. అద్భుతంగా నటించారని అభినందించడంతో పాటు ఈ సినిమా నాకు బాగా సరిపోతుంది. నేను రీమేక్ చేయాలనుకుంటున్నాను అని సల్మాన్ చిరుతో చెప్పాడని సమాచారం.

చిరు స‌ల్మాన్ల మధ్య అనుబంధం ఎంతటి బలమైనదో అందరికీ తెలుసు. సల్మాన్ మాటలకు సంతోషించిన చిరు మైత్రి మూవీ మేకర్స్ తో మాట్లాడి రీమేక్ రైట్స్ ఇప్పిస్తాను బాయ్. నీ తదుపరి చిత్రానికి దీనిని ప్లాన్ చేసుకో అన్నాడట. అలా మెగాస్టార్ సినిమా థియేటర్స్ లో రన్ అవుతుండగానే వేరే భాషలో రీమేక్ అవ్వడానికి సిద్ధపడుతోంది.

Updated On 21 Jan 2023 3:29 AM GMT
krs

krs

Next Story